Chandrayaan-2: ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలను అమెరికా, రష్యా, చైనా, యూరప్ దేశాలు మాత్రమే చేసేవి. ఆ దేశాలు చేసిన ప్రయోగాలను ప్రపంచ దేశాలు ఆశ్చర్యంగా చూసేవి. అందులో భారత్ కూడా ఉండేది. మన శాస్త్ర సాంకేతిక రంగాలు అప్పట్లో అంతగా అభివృద్ధి చెందలేదు. పైగా మన అంతరిక్ష సంస్థకు కేటాయింపులు అంత గొప్పగా లేవు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒకప్పుడు ఇతర దేశాలు ప్రయోగాలు చేస్తుంటే చూసిన భారత్.. ఇప్పుడు తను చేస్తున్న ప్రయోగం ద్వారా ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకుంది. తిప్పుకోవడం మాత్రమే కాదు ఆశ్చర్యంగా చూసేలా.. రెండు చేతులతో చప్పట్లు కొట్టేలా చేస్తోంది.
భారతీయ అంతరిక్ష సంస్థ 2019లో చంద్రుడి మీద ఉన్న అద్భుతాలను తెలుసుకోవడానికి.. ఆశ్చర్యకరమైన విషయాలను ప్రపంచానికి చెప్పడానికి చంద్రయాన్ -2 మిషన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు రూపొందించిన చంద్రయాన్ -2 ను జాబిల్లి మీదికి పంపించింది.. ఈ ప్రయోగం అంత సులువైనది కాదు. గొప్ప గొప్ప దేశాలు కూడా చేయలేనిది.. చేయడానికి వెనుకడుగు వేసింది.. చంద్రయాన్-2 చేసి చూపించింది. అది చేస్తున్న అద్భుతాలను అహ్మదాబాద్ లోని ఇస్రో ఎస్ ఏ సీ శాస్త్రవేత్తలు.. దాని డి ఎఫ్ ఎస్ ఏ రాడార్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.
సుమారు 1400 రాడార్ డేటా సెట్స్ ను సమీకరించి అందులో ఉన్న సమాచారాన్ని ప్రాసెస్ చేశారు. తొలిసారి చంద్రుడి పూర్తి పొలారి మెట్రిక్, ఎల్ బ్యాండ్ రాడార్ మ్యాపులను మొత్తం రూపొందించారు. ఇది చంద్రుడి ఉపరితలంపై నీరు, మంచు జాడలను కనుగొనడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయని అంతటి అమెరికా కూడా తెలుసుకోలేకపోయింది. రష్యా కూడా ఆ దిశగా ప్రయోగాలు చేయలేకపోయింది. చైనా కూడా ఇటువంటి విషయాలను ప్రపంచానికి తెలియజెప్పలేకపోయింది. అయితే ఇస్రో రూపొందించిన చంద్రయాన్ -2 ప్రయోగం ద్వారా ఈ విషయాలు ప్రపంచానికి తెలిసాయి. అయితే ఈ ప్రయోగాలు ఇక్కడితోనే ఆగవని.. చంద్రుడికి సంబంధించిన అనేక విషయాలను ఈ ప్రయోగం బయట పెడుతుందని తెలుస్తోంది. కేవలం నీటి జాడలు, మంచు మాత్రమే కాకుండా.. చంద్రుడి మీద అనేక అద్భుతాలు ఉన్నాయని.. అవి త్వరలోనే వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.