https://oktelugu.com/

రూ. 9 లక్షల కారు కేవలం రూ. 2.70 లక్షలకే.. నచ్చకపోతే డబ్బు వాపస్!

కొత్తగా కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఆన్‌లైన్ వెబ్‌సైట్ స్పిన్నీ శుభవార్త చెప్పింది. ఈ కారు ద్వారా తక్కువ ధరకే అధునాతన ఫీచర్లు ఉన్న కారును సొంతం చేసుకోవచ్చు. 9 లక్షల రూపాయల విలువ చేసే హ్యుందాయ్ ఐ20 కారు ఈ వెబ్ సైట్ లో కేవలం 2.70 లక్షల రూపాయలకే పొందే అవకాశం ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఈ వెబ్ సైట్ ద్వారా కారు కొనుగోలు చేస్తే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 22, 2021 / 11:33 AM IST
    Follow us on

    కొత్తగా కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఆన్‌లైన్ వెబ్‌సైట్ స్పిన్నీ శుభవార్త చెప్పింది. ఈ కారు ద్వారా తక్కువ ధరకే అధునాతన ఫీచర్లు ఉన్న కారును సొంతం చేసుకోవచ్చు. 9 లక్షల రూపాయల విలువ చేసే హ్యుందాయ్ ఐ20 కారు ఈ వెబ్ సైట్ లో కేవలం 2.70 లక్షల రూపాయలకే పొందే అవకాశం ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఈ వెబ్ సైట్ ద్వారా కారు కొనుగోలు చేస్తే మంచిది.

    ప్రస్తుత పరిస్థితుల్లో కార్ల ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు, కొనుగోలు జరిపే స్పిన్నీ 11 మోడల్ హ్యుందాయ్ ఐ20 ఆస్టా 1.2 కారు ఫస్ట్ ఓనర్ ద్వారా అమ్మకానికి వచ్చింది. ఇప్పటివరకు 91,142 కిలోమీటర్లు తిరిగిన ఆ కారుకు ఈ ఏడాది నవంబర్ వరకు ఇన్సూరెన్స్ ఉంది. స్పిన్నీ వెబ్ సైట్ ద్వారా ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

    ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా ఉచితంగా సంవత్సరం వారంటీని పొందవచ్చు. 12.5 శాతం వడ్డీరేటుపై ఐదేళ్ల రుణంతో కూడా ఈ కారును తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా 4,804 రూపాయలు ఈ.ఎం.ఐ చెల్లించాల్సి ఉంటుంది. ఐదు రోజుల మనీబ్యాక్ గ్యారెంటీని కూడా పొందే అవకాశం ఉంటుంది. స్పిన్నీ ఈ కారును కొనుగోలు చేసిన వాళ్లకు బైబ్యాక్ సదుపాయాన్ని కల్పిస్తుండటం గమనార్హం.

    కారును 18 నెలలు నడిపిన తరువాత తిరిగి ఇచ్చేస్తే 1,83,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఈ కారును కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.