Blue Origin Launch: అంతరిక్షంలోకి ఒకప్పుడు పురుషుల మాత్రమే వెళ్లేవారు. అది కూడా అంతరిక్ష పరిశోధనల కోసమే. తర్వాత మహిళా ఆస్ట్రోనాట్స్ వచ్చారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వంటి భారత సంతతి మహిళలు కూడా అంతరిక్ష యానం చేశారు. ఇప్పుడు అంతరిక్ష యానం(Space Tour) పరిశోధనల కోసమే కాదు.. ప్రయాణానికి అందుబాటులోకి వచ్చింది. గతేడాది స్పేస్ ఎక్స్‌లో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. తాజాగా మహిళలు వెళ్లొచ్చారు.
Also Read: డీఆర్డీవో మరో సృష్టి.. భారత ఆర్మీ అమ్ముల పొదిలో మరో సూపర్ అస్త్రం!
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్(Blue Origine) సంస్థ వినూత్న అంతరిక్ష యాత్రలతో మరోసారి చరిత్ర సృష్టించింది. ఈసారి పూర్తిగా మహిళా సెలబ్రిటీల బృందంతో రోదసి పర్యటనను విజయవంతంగా నిర్వహించింది.
A smooth landing in West Texas.
Book your flight on New Shepard: https://t.co/RP3Lixyr4Y pic.twitter.com/xPiu9LMtlH
— Blue Origin (@blueorigin) April 14, 2025
11 నిమిషాల అద్భుత అనుభవం
పశ్చిమ టెక్సాస్(North Texas) నుంచి ప్రారంభమైన ఈ యాత్ర న్యూ షెపర్డ్ (Shefard)వ్యోమనౌక ద్వారా జరిగింది. 107 కిలోమీటర్ల ఎత్తులోకి చేరిన ఈ బందం, కొన్ని నిమిషాలపాటు గురుత్వరహిత స్థితిని ఆస్వాదించి, అద్భుత అనుభూతిని పొందింది.
REPLAY: A New Shepard tradition pic.twitter.com/dSexRmoZl7
— Blue Origin (@blueorigin) April 14, 2025
స్ఫూర్తిదాయక మహిళల సమూహం
ఈ యాత్రలో వివిధ రంగాల్లో రాణిస్తున్న ఆరుగురు మహిళలు పాల్గొన్నారు. గేల్ కింగ్, జెఫ్ బెజోస్‌కు కాబోయే భార్య లారెన్ శాంచెజ్‌ప్రముఖ గాయని, చిత్ర నిర్మాత, జర్నలిస్ట్, సైన్స్ విద్య ప్రోత్సాహకురాలు, గ్రహాల పరిశోధకురాలు వంటి వారు ఈ బృందంలో ఉన్నారు.
చరిత్రలో మరో మైలురాయి
అమెరికా(America) చరిత్రలో పూర్తిగా మహిళలతో నిర్వహించిన తొలి అంతరిక్ష యాత్రగా ఇది నిలిచింది. గతంలో 1963లో సోవియట్ వ్యోమగామి ఒక్కరే రోదసిలోకి వెళ్లిన రికార్డును ఈ యాత్ర మరింత బలపరిచింది.
A smooth landing in West Texas.
Book your flight on New Shepard: https://t.co/RP3Lixyr4Y pic.twitter.com/xPiu9LMtlH
— Blue Origin (@blueorigin) April 14, 2025
బ్లూ ఆరిజిన్ దూకుడు
బ్లూ ఆరిజిన్ ఇప్పటికే పది అంతరిక్ష యాత్రలను పూర్తి చేసి, 11వ యాత్రను కూడా విజయవంతంగా నిర్వహించింది. మహిళల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన ఈ యాత్ర, అంతరిక్ష పర్యాటక రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.