Asteroid: ఇన్నాళ్ళూ.. భూమి మనగడకు ముప్పు కలిగించడంలో మనిషి చేష్టలు మాత్రమే ప్రధాన కారణమని చదువుకున్నాం. అభివృద్ధి పేరుతో మనిషి చేస్తున్న విధ్వంసం తాలూకూ పర్యవసానాలను చవి చూస్తూనే ఉన్నాం. 2012లో యుగాంతం సంభవిస్తుందని భయపడ్డాం. దీనిపై సినిమా కూడా వచ్చింది. అయితే మనుషుల వల్లే కాకుండా.. అంతరిక్షం లో ఉన్న గ్రహ శకలాలు కూడా భూమికి ముప్పు కలిగించనున్నాయా? మరి కొద్ది రోజుల్లో వాటి వల్ల భూమికి ఇబ్బంది ఏర్పడనుందా? జీవరాశులు అంతమయ్యే ప్రమాదం పొంచి ఉందా? అంటే వీటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని నాసా రిపోర్ట్స్ చెప్తున్నాయి.
ఒక ప్రమాదకరమైన గ్రహశకలం భూమిని ఢీ కొట్టబోతుందని నాసా వెలువరించిన ఓ అధ్యయనంలో తేలింది.. అయితే జరగబోయే నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నామని.. దానిని ఎలా అడ్డుకోవాలో తమ వద్ద ఎలాంటి వ్యూహం లేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ” అకస్మాత్తుగా భూమిని ఏదైనా గ్రహశకలం ఢీకొంటె పరిస్థితి ఏంటి? దాని ప్రభావం నుంచి ఎలా భూమిని తప్పించాలి? ఒకవేళ ఆ గ్రహశకలం భూమిని ఢీకొంటే.. ఆ ప్రమాదాన్ని తట్టుకునే శక్తి జీవరాశికి ఉంటుందా” అనే అంశాలపై ఇటీవల నాసా ఒక ప్రయోగం నిర్వహించింది. “ప్లానిటరీ డిఫెన్స్ ఇంటర్ ఏజెన్సీ టేబుల్ టాప్ ఎక్సర్ సైజ్” పేరుతో ఒక ప్రయోగం లాంటి సమీక్ష నిర్వహించింది.. ఒకవేళ గ్రహశకలం భూమిని ఢీకొంటే ఎలాంటి పరిస్థితి తలెత్తుతుంది అనే అంశం మీద కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగం నిర్వహించింది. వారి అధ్యయనంలో గ్రహ శకలం భూమిని ఢీకొనేందుకు 72% అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దానిని నిలువరించే సత్తా తమ వద్ద లేదని నాసా అధికారులు చెబుతున్నారు..నాసా నిర్వహించిన ఎక్సర్ సైజ్ లో దేశ విదేశాల నుంచి వందల కొద్ది ప్రతినిధులు పాల్గొన్నారు.. అమెరికాలోని మేరీ ల్యాండ్ ప్రాంతంలో జాన్స్ హాఫ్ కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ ప్రయోగశాలలో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.
నాసా అంచనా ప్రకారం గ్రహశకలం వచ్చే 14 సంవత్సరాలలో భూమిని ఢీకొనే అవకాశం 72% దాకా ఉందట. 2038 జూలై 12న ఆ సంఘటన జరిగేందుకు అవకాశం ఉందట. అయితే ఆ గ్రహ శకలం పరిమాణం, అందులో ఉన్న మిశ్రమం, అది దూసుకొచ్చే వేగం, వచ్చే ప్రాంతం గురించి నాసా ఎటువంటి వివరాలు బయటకు వెల్లడించలేదు. దీనికి సంబంధించి ట్రాక్ చేసేందుకు తమ వద్ద ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదని నాసా ప్రకటించింది. ఒకవేళ గ్రహశకలం ఢీకొనే పరిస్థితులే ఉంటే.. విపత్తు నిర్వహణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో తమ వద్ద ఎటువంటి స్పష్టత లేదని నా స్పష్టం చేసింది. ఆ గ్రహశకలం భూమి వైపు వస్తున్నప్పుడు దాని దిశను ఆపేందుకు డబుల్ ఆస్ట్రాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్ ( డార్ట్) మిషన్ ఆపుతుందని.. కైనెటిక్ ప్రభావంతో గ్రహశకలం దిశను మార్చే అవకాశం ఉంటుందని నాసా ప్రకటించింది.. అయితే దీనిని ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నామని.. దీనికోసం నియో సర్వేయర్ టెక్నాలజీ వాడుతున్నామని వెల్లడించింది..
నియో సర్వేయర్ టెక్నాలజీ అనేది అంతరిక్ష టెలిస్కోప్ ఇన్ ఫ్రా రెడ్ సామర్థ్యంతో పని చేస్తుంది. ఇది భూమికి దగ్గర్లో ఉన్న ప్రమాదకరమైన వస్తువులు, గ్రహ శకలాలు.. భూమిని ఢీకొట్టేందుకు చాలా సమయం ముందే గుర్తిస్తుంది. భూమికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహ శకలాలను గుర్తించి.. ప్రమాదాన్ని అంచనా వేసి.. దానిని నిలువరించేందుకు తగిన సూచనలు, సలహాలను నాసా కు వెల్లడిస్తుంది. అయితే ఈ నియో సర్వేయర్ టెక్నాలజీ 2028 జూన్ నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని నాసా ప్రకటించింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Asteroid to hit earth on july 12 2038
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com