Artificial Intelligence: పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని అత్యంత సులభతరం చేసింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులు మనిషి జీవితంలో ఊహించని విధంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు ఎంతయితే మంచిని ఇస్తున్నాయో.. అంతే స్థాయిలో చెడును కూడా ఇస్తున్నాయి.
శాస్త్ర సాంకేతిక రంగం వల్ల మనిషి జీవితం సుఖవంతమైన మాట వాస్తవమే.. ఇదే స్థాయిలో కష్టాలు కూడా వస్తున్నాయి. నష్టాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వీటివల్ల మనుషులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, ఇంకా అనేక విధాలుగా మనుషులు నష్టపోతున్నారు.
శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చిన మార్పుల వల్ల ఇటీవల కాలంలో కృత్రిమ మేధ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇది మనిషి జీవితాన్ని మరోవైపు తీసుకెళ్తోంది. రక్షణ రంగం నుంచి మొదలుపెడితే వైద్యరంగం వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనిదే పనులు జరగని పరిస్థితి నెలకొంది. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కానీ.. ఇప్పటివరకైతే సమస్త రంగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కృత్రిమ మేధ వల్ల ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా కోల్పోతూనే ఉన్నారు. అయితే భవిష్యత్ కాలంలో కృత్రిమ మేధ వల్ల మరిన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక మాంధ్యం కంటే దారుణమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
” 2008లో ఏర్పడిన సంక్షోభం అనేక రకాల మార్పులకు కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆర్థికంగా కుప్ప కూలిపోయాయి. అయితే ఇప్పుడు అంతకుమించిన దారుణమైన పరిస్థితులు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. ఇటీవల విడుదలైన ఒక ఆర్థిక సర్వేను నిపుణులు ఉటంకిస్తున్నారు. ” 2008లో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోయింది. అప్పుడు చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు అంతకుమించిన దారుణమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం కల్పిస్తోంది. దీనికి తక్కువ సమయం మాత్రమే ఉంది. ఒకవేళ అదే గనుక జరిగితే కంప్యూటర్ ఆధారిత పరిశ్రమల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. మనదేశంలోని ఐటిరంగం, వైట్ కాలర్ ఉద్యోగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్దముప్పుగా పరిణమిస్తుంది. మనదేశంలో ఐటీరంగంలో వృద్ధి కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా కొత్త ఉద్యోగాలు రావడం లేదని” ఆర్థిక సర్వే వెల్లడించింది.