Guna Shekhar And Teja Sajja: బాలనటుడిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకులకు అత్యంత చేరువైన వారిలో ఒకరు తేజ సజ్జ(Teja Sajja). పెద్దయ్యాక సినిమాల్లో హీరో అవ్వాలనే పట్టుదలతో వచ్చాడు. మొదట్లో ఇతనికి హీరో గా అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సాహసం చేయలేదు. కానీ ‘ఓ బేబీ’ చిత్రం లో నందిని రెడ్డి ఇతనికి ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో తేజ సజ్జ అందరి దృష్టిలో పడ్డాడు. ఇక ఆ తర్వాత ఈయనకు హీరో గా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కెరీర్ ప్రారంభం లో అద్భుతం, ఇష్క్, జాంబీ రెడ్డి వంటి చిత్రాలు చేసాడు. వీటిల్లో థియేట్రికల్ గా జాంబీ రెడ్డి పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో కలిసి ‘హనుమాన్’ అనే చిత్రం చేసాడు.
చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపుగా 295 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఆ తర్వాత ఆయన చేసిన ‘మిరాయ్’ చిత్రం కూడా 140 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలా ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న క్రేజీ హీరో గా మారిపోయాడు తేజ సజ్జా. ఇదంతా పక్కన పెడితే ఈ తేజ సజ్జ తో గతంలో డైరెక్టర్ గుణ శేఖర్ పని చేసిన అనుభవాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు. గుణ శేఖర్ తెరకెక్కించిన ‘చూడాలని ఉంది’ చిత్రం తోనే తేజ సజ్జ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. అయితే గుణ శేఖర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘యుఫోరియా’ మూవీ విడుదల సందర్భంగా, ప్రొమోషన్స్ లో భాగంగా చూడాలని ఉంది షూటింగ్ సమయం లో ఎవరికీ తెలియని ఒక నిజాన్ని చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘చూడాలని ఉంది ద్వారానే తేజ సజ్జ ని ఇండస్ట్రీ కి బాలనటుడిగా పరిచయం చేసాను. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తేజ సజ్జ ని స్విమ్మింగ్ పూల్ లో విసిరి వేసే సన్నివేశం ఒకటి ఉంటుంది గుర్తుందా?, ఆ సన్నివేశం లో తేజ సజ్జ ని నిజంగానే స్విమ్మింగ్ పూల్ లో తోశాము. అతనికి స్విమ్మింగ్ నిజంగానే రాదు కాబట్టి, అతని రియాక్షన్స్ కూడా చాలా నేచురల్ గా వచ్చాయి. ఆ సంఘటన ని ఇప్పుడు తల్చుకుంటే, నేను ఎంత నీచంగా, మూర్ఖంగా ప్రవర్తించానో తెలుస్తుంది. అలా ఇప్పుడు చేస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అప్పట్లో కూడా కావాలని అలా చెయ్యలేదు. తెలియకుండా అలా పొరపాటు జరిగిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు గుణ శేఖర్.