Apple
Apple : ఆపిల్ ప్రొడక్ట్స్ వాడుతున్న వారికి భారత ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. మీరు ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ టీవీ లేదా ఆపిల్ విజన్ ప్రో వంటి ఏదైనా ఆపిల్ డివైజ్ లను ఉపయోగిస్తుంటే, మీ భద్రత కోసం ఈ సమాచారం తప్పకుండా తెలుసుకోవాలి. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) ఆపిల్ యూజర్లకు హెచ్చరికను విడుదల చేసింది.
CERT-In నివేదిక ప్రకారం.. ఆపిల్ పరికరాలలో అనేక ప్రమాదకరమైన భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఈ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు మీ పరికరాల్లోకి చొరబడే ప్రమాదం ఉంది. తద్వారా మీ వ్యక్తిగత డేటాను దొంగిలించడమే కాకుండా, మీ పరికరంపై కంట్రోల్ సాధించే అవకాశం కూడా ఉంది. ఇది మీ వ్యక్తిగత గోప్యతకు పెను ముప్పు కలిగించవచ్చు. ఈ హెచ్చరిక ‘CIVN-2025-0071’ పేరుతో జారీ చేయబడింది. ఈ భద్రతా లోపాలు iOS, macOS, iPadOS, Safari బ్రౌజర్, ఇతర ఆపిల్ సాఫ్ట్‌వేర్‌లపై ప్రభావం చూపగలవని CERT-In తెలిపింది. ముఖ్యంగా పాత వెర్షన్లు వాడుతున్న యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ప్రమాదం వ్యక్తిగత యూజర్లతో పాటు, సంస్థలకు కూడా వర్తిస్తుందని CERT-In హెచ్చరించింది.
ప్రమాదంలో ఉన్న ఆపిల్ పరికరాల వెర్షన్లు
* iPhone, iPad: iOS, iPadOS వెర్షన్ 18.4, 17.7.6, 16.7.11, 15.8.4 కంటే పాత వెర్షన్లు.
* Mac: macOS Sequoia 15.4, Sonoma 14.7.5, Ventura 13.7.5 కంటే ముందు వెర్షన్లు.
* Apple TV: tvOS 18.4 కంటే ముందు వెర్షన్లు.
* Apple Vision Pro: visionOS 2.4 కంటే పాత వెర్షన్లు.
* Safari బ్రౌజర్: 18.4 కంటే ముందు వెర్షన్లు.
* Xcode: 16.3 కంటే పాత వెర్షన్లు.
ఈ భద్రతా లోపాల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ పరికరాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉంది. వారు మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించవచ్చు. మీ సిస్టమ్‌పై పూర్తి నియంత్రణ సాధించవచ్చు లేదా మీ పరికరాన్ని పూర్తిగా నిష్క్రియంగా కూడా మార్చగలరు. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి CERT-In అన్ని ఆపిల్ యూజర్లకు వెంటనే తమ పరికరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. ఆపిల్ ఈ లోపాలను సరిచేయడానికి సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేసింది. మీ పరికరాన్ని అప్‌డేట్ చేయడానికి ఈ దశలను ఫాలో అవ్వండి.
* iPhone/iPad: సెట్టింగ్స్‌లోకి వెళ్లి > జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేయండి.
* Mac: సిస్టమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి > జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేయండి.
* Apple TV, ఇతర పరికరాలు: సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్ అప్‌డేట్ ఎంపికను ఎంచుకోండి.
భవిష్యత్తులో భద్రతాపరమైన అప్‌డేట్‌లు ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయ్యేలా ఆటోమేటిక్ అప్‌డేట్‌ను ఆన్ చేసుకోవడం కూడా మంచిది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Apple security update warning
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com