Vasthu Tips : ఒక్కోసారి ఎంత డబ్బు సంపాదించిన ఇంట్లో నిలవకుండా ఉంటుంది. మరికొందరి ఇంట్లో నిత్యం ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య నిత్యం తగాదాలు ఉంటాయి. అయితే తాము అంతా బాగానే ఉన్నా.. తమకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతుంది? అని బాధపడుతూ ఉంటారు. అయితే ఇంట్లోని కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలు ఉండవని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ముఖ్యంగా ఇంటికి ముఖ్యంగా ఉండే కిచెన్ ను లక్ష్మీతో పోలుస్తారు. వంటింటి లో కొన్ని పదార్థాలు ఇష్టం వచ్చినట్లు ఉండడంతో పాటు.. కొన్ని వాస్తు ప్రకారం లేకపోవడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు.. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అసలు వంటింట్లో ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు?
Also Read : పాస్ పోర్ట్ లు రెడ్, నీలం, వైట్ రంగుల్లో ఎందుకు ఉంటాయి?
వంటింట్లోని కొన్ని సామాన్లు వాస్తు ప్రకారం గా ఉంచుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా ఉప్పు. ఉప్పు లక్ష్మీదేవికి స్వరూపం. ఉప్పు ఉండే పాత్ర మూత ఎప్పటికీ ఓపెన్ చేసి ఉండకూడదు. దీని అవసరం తీరినాక మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే ఉప్పు మూత ఓపెన్ చేసి అలాగే ఉంచితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలాగే మసాలాల డబ్బాలు కూడా మూతలు తీసి ఉంచకూడదు. ఇవి అలాగే ఉండడంవల్ల ఆర్థిక నష్టాలు జరుగుతూ ఉంటాయి.
ఇంట్లోని వస్తువులతో పాటు పాత్రలు కూడా ఇంటికి శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల అన్ని పాత్రలు సక్రమంగా ఉండాలని చూసుకోవాలి. అంటే విరిగిన గిన్నెలు లేదా విరిగిన చెంచాలను కిచెన్ రూమ్ లో అస్సలు ఉంచవద్దు. ఇలా ఉంచడం వల్ల ఎప్పుడూ అనారోగ్యంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా వీటితో భోజనం చేయడం వల్ల కూడా సమస్యలే ఉంటాయి. వీటితో ఆర్థిక నష్టం కూడా చేకూరి అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది.
ఈ మధ్య కాలంలో కొందరు డస్ట్ బిన్ ను వంటింట్లో కూడా పెడుతున్నారు. అయితే వంటింట్లో డస్ట్ బిన్ ను ఏర్పాటు చేసుకోవాలని అనుకునేవారు గ్యాస్ స్టవ్ కు దూరంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్, డస్ట్ బిన్ పక్కపక్కనే ఉండడం వల్ల అనేక ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈ డస్ట్ బిన్ ఏదైనా ఒక మూలకు ఉంచే ప్రయత్నం చేయాలి. ఇక వంటింట్లో గ్యాస్ పక్కనే నీటిని ఏర్పాటు చేసుకోవద్దు. నేటికీ గ్యాస్ స్టవ్ కి కాస్త దూరం ఉండాలి. ఇలా ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఏర్పడతాయి. నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి.
ఇక సింకు పక్కనే గ్యాస్ స్టవ్ను ఉంచకుండా కాస్త దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ సింకులో ఎప్పుడు పాడైపోయిన ఆహార పదార్థాలు.. లేదా ఎక్కువసేపు శుభ్రం చేయని పాత్రలు ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అందువల్ల ఈ పరిహారాలను చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని అంటున్నారు.