Antutu Score: ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు ‘కెమెరా ఎంత మెగాపిక్సెల్స్?‘ లేదా ‘బ్యాటరీ ఎన్ని రోజులు ఉంటుంది?‘ అనే ప్రశ్నలు సర్వసాధారణంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ‘ఈ ఫోన్ గేమింగ్‌కు బాగుంటుందా?‘ లేదా ‘ప్రాసెసర్ సామర్థ్యం ఎలా ఉంది?‘ అనే అంశాలు కొనుగోలుదారుల మదిలో మెదులుతున్నాయి. ఈ నేపథ్యంలో AnTuTu స్కో అనే పదం తరచూ వినిపిస్తోంది. కొందరు ఈ స్కోరును ఆధారంగా చేసుకుని ఫోన్ కొంటుండగా, మొబైల్ కంపెనీలు కూడా తమ డివైజ్‌లు అత్యధిక స్కోరు సాధించాయంటూ ప్రచారం చేస్తున్నాయి. అసలు ఈ AnTuTu స్కోరు ఏమిటి? దీన్ని ఎలా కొలుస్తారు? దీని ప్రయోజనం ఏంటి? తెలుసుకుందాం.
Also Read: ఎలన్ మస్క్ ఏఐ గ్రోక్ లో ఊహించని ఫీచర్
AnTuTu స్కోరు అంటే ఏమిటి?
AnTuTu అనేది స్మార్ట్‌ఫోన్లు. టాబ్లెట్‌ల సామర్థ్యాన్ని కొలిచే ఒక బెంచ్‌మార్క్ టూల్. దీనితో పాటు గీక్‌బెంచ్, 3D మార్క్ వంటి ఇతర బెంచ్‌మార్క్‌లు కూడా ఉన్నప్పటికీ, AnTuTu ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆమోదించే ప్రమాణంగా మారింది. ఇది ఫోన్‌లోని ఇ్క్ఖ (ప్రాసెసర్ వేగం), GPU, RAM (మెమరీ), మరియు ్ఖగీ (యూజర్ ఎక్స్‌పీరియన్స్) వంటి అంశాలను పరీక్షించి, ఒక సంఖ్యాత్మక స్కోరును అందిస్తుంది. ఈ స్కోరే AnTuTu స్కోరుగా పిలువబడుతుంది.
స్కోరు ఎక్కువైతే ఏం జరుగుతుంది?
AnTuTu స్కోరు ఎంత ఎక్కువ ఉంటే, ఆ ఫోన్ అంత శక్తివంతంగా మరియు వేగంగా పనిచేస్తుందని అర్థం. ఉదాహరణకు, 4,00,000 స్కోరు ఉన్న ఫోన్ కంటే 8,00,000 స్కోరు ఉన్న ఫోన్ రెట్టింపు సామర్థ్యంతో పనిచేస్తుంది. ఎక్కువ యాప్‌లు ఒకేసారి తెరిచినా హ్యాంగ్ కాకుండా ఉంటుంది, పెద్ద గేమ్‌లను సాఫీగా ఆడొచ్చు. తక్కువ స్కోరు ఉన్న ఫోన్‌లలో గేమింగ్ సమయంలో ఆగిపోవడం, హ్యాంగ్ అవడం, స్క్రీన్ బ్లాక్ అవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఎవరికి ఉపయోగం?
గేమర్స్ మరియు మల్టీటాస్కర్స్: గేమింగ్ లేదా ఒకేసారి బహుళ యాప్‌లు పయోగించాలనుకునే వారికి AnTuTu స్కోరు చూడటం ఉపయోగపడుతుంది.
సాధారణ వినియోగదారులు: కేవలం కాల్స్, మెసేజ్‌లు లేదా కెమెరా కోసం ఫోన్ కొనేవారికి ఈ స్కోరు పెద్దగా పట్టించనవసరం లేదు.
స్కోరు రేంజ్‌లు:
ఎంట్రీ లెవల్ (2,00,000 – 4,00,000): సాధారణ వినియోగం (కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా) కోసం సరిపోతుంది.
మిడ్–రేంజ్ (4,00,000 – 7,00,000): మల్టీటాస్కింగ్ మరియు సాధారణ గేమింగ్‌కు అనువైనవి.
ఫ్లాగ్‌షిప్ (7,00,000 – 15,00,000+): హై–ఎండ్ గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి భారీ పనులకు అనుకూలం.
ఎలా చెక్ చేయాలి?
AnTuTu ఒక చైనీస్ యాప్ కావడంతో గూగుల్ ప్లే స్టోర్‌లో లభించదు. దీన్ని అధికారిక వెబ్‌సైట్ (antutu.com) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లోని ‘ఖ్చnజుజీnజ‘ సెక్షన్‌లో తాజా ఫోన్‌ల స్కోర్‌లు చూడొచ్చు. ఉదాహరణకు, ప్రస్తుతం జీఖౖౖ సిరీస్ 13,26,98,668 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. అలాగే, ఆన్‌లైన్‌లో మీ ఫోన్ మోడల్ స్కోరును సెర్చ్ చేస్తే కూడా తెలుస్తుంది.
నిజమైన స్కోరా?
antutu.com స్కోరు ఫోన్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది కానీ, కొన్ని సందర్భాల్లో కంపెనీలు తమ డివైజ్‌లను ఆప్టిమైజ్ చేసి స్కోర్‌ను పెంచే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, ఈ స్కోరు రియల్–టైమ్ పనితీరుకు పూర్తి ప్రతిబింబం కాకపోవచ్చు. గేమర్స్ లేదా టెక్ ఔత్సాహికులు దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు, కానీ సాధారణ వినియోగదారులకు ఇతర అంశాలు (కెమెరా, బ్యాటరీ, డిజైన్) కూడా ముఖ్యమే.
మొత్తంగా, AnTuTu స్కోరు ఒక స్మార్ట్‌ఫోన్ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉపయోగకరమైన సూచిక, కానీ అది ఒక్కటే కొనుగోలు నిర్ణయాన్ని నిర్దేశించకూడదు!