Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీGrok AI : ఎలన్ మస్క్ ఏఐ గ్రోక్ లో ఊహించని ఫీచర్

Grok AI : ఎలన్ మస్క్ ఏఐ గ్రోక్ లో ఊహించని ఫీచర్

Grok AI : గ్రోక్‌ (Grok) అనేది xAI ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక అధునాతన AI చాట్‌బాట్, దీని లక్ష్యం వినియోగదారులకు రియల్‌–టైమ్‌ సమాచారం, హాస్యం, నిజాయితీతో కూడిన సమాధానాలు అందించడం. గ్రోక్‌ 3, ఇటీవల 2025 ఫిబ్రవరిలో విడుదలైన వెర్షన్, దాని అద్భుతమైన ఫీచర్‌లతో గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. తాజాగా ‘గ్రోక్‌’లో ఫొటో ఎడిట్‌ ఫీచర్‌ అద్భుతంగా ఉంది. ఇది XAI వారి గ్రోక్‌ 3 వెర్షన్‌లో భాగంగా వచ్చిన ఒక సరికొత్త సామర్థ్యం. ఈ ఫీచర్‌తో మీరు ఫొటోలను చాట్‌ ద్వారా సులభంగా ఎడిట్‌ చేయవచ్చు. రంగులు మార్చడం, లైటింగ్‌ సర్దుబాటు(Lighting Adjustment) చేయడం, కొత్త వస్తువులను జోడించడం, టెక్స్‌ట్‌ చేర్చడం వంటివి చేయొచ్చు. గీలోని పోస్ట్‌ల ప్రకారం, ఈ ఫీచర్‌ ఇప్పటికే వినియోగదారులను ఆశ్చర్యపరుస్తోంది. ఉదాహరణకు, ఒక సాధారణ ఫొటోను వాన్‌ గాగ్‌ పెయింటింగ్‌ స్టైల్‌(Painting Style)లోకి మార్చడం లేదా పాత్రల లక్షణాలను సవరించడం వంటివి చాలా సులభంగా చేయగలుగుతోంది.

Also Read : ట్విట్టర్ లో ‘గ్రోక్’ సంచలనం..నెటిజెన్స్ తో చెడుగుడు ఆడుకుంటున్న రోబో..పూర్తి వివరాలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

పరిమితులు కూడా..
అయితే ఈ ఫీచర్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఒక పాత్రను పూర్తిగా ఎడమవైపు తిప్పడం లేదా చిత్రాన్ని విస్తరించి పూర్తి శరీరాన్ని చూపించడం వంటివి కొంత కష్టంగా ఉంటున్నాయని కొందరు యూజర్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ ఫీచర్‌ ప్రారంభ దశలోనే ఇంత అద్వితీయంగా పనిచేస్తుండటం నిజంగా మామూలు విషయం కాదు. ఇది అఐ టెక్నాలజీతో మన పనిని ఎంత సౌలభ్యంగా, సృజనాత్మకంగా మార్చగలదో చూపిస్తోంది.

గ్రోక్‌ ఫీచర్‌లు..

ఇమేజ్‌ జనరేషన్‌:
గ్రోక్‌ 3లో ‘ఆరోరా‘ అనే అధునాతన ఇమేజ్‌ జనరేషన్‌ మోడల్‌ ఉంది. ఇది ఫోటోరియలిస్టిక్‌ చిత్రాలను టెక్ట్స్‌ ప్రాంప్ట్‌ల ఆధారంగా సృష్టిస్తుంది. ఉదాహరణకు, ‘ఒక పిల్లిని యానిమే స్టైల్‌లో చూపించు‘ అని అడిగితే, అది అలాంటి చిత్రాన్ని రూపొందిస్తుంది.

ఇమేజ్‌ ఎడిటింగ్‌:
గ్రోక్‌ 3లో కొత్తగా చేరిన ఫీచర్‌ ఇమేజ్‌ ఎడిటింగ్‌. వినియోగదారులు జనరేట్‌ చేసిన చిత్రాలను ఫాలో–అప్‌ సందేశాలతో సవరించవచ్చు. రంగులు మార్చడం, వస్తువులు జోడించడం, లైటింగ్‌ సర్దుబాటు చేయడం వంటివి సులభంగా చేయొచ్చు. ఈ ఫీచర్‌ గీలో డైరెక్ట్‌గా అందుబాటులో ఉంది.

స్టెప్‌–బై–స్టెప్‌ రీజనింగ్‌:
గణితం, సైన్స్, కోడింగ్‌ వంటి సంక్లిష్ట ప్రశ్నలను దశలవారీగా వివరిస్తుంది, దీనివల్ల వినియోగదారులకు సమస్యను అర్థం చేసుకోవడం సులభమవుతుంది.

Also Read : దేవుడికి, సైన్స్, గణితానికి ఏంటి సంబంధం.. హార్వర్డ్ పరిశోధనలో ఏం తేలింది?

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular