ఫేస్ బుక్ కొనుగోలు చేసిన తరువాత వాట్సాప్ యాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లను మరింత చేరువవుతోంది. ఇప్పటికే యూజర్లకు ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ వెబ్ యూజర్లకు కూడా తీపి కబురు చెప్పింది. ఇకపై వాట్సాప్ వెబ్ యూజర్లు కూడా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. త్వరలో ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
Also Read: స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచే ట్రిక్స్ ఇవే..?
మొబైల్ వెర్షన్ కు మాత్రమే పరిమితమైన వీడియో కాల్స్ ఫీచర్ వెబ్ వెర్షన్ లో కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా యూజర్ల సంఖ్యను మరింత పెంచుకోవచ్చని వాట్సాప్ భావిస్తోంది. వాట్సాప్ బీటా వెర్షన్ ను వాడే యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా త్వరలో మిగిలిన యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని సమాచారం. రోజురోజుకు వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ కు ప్రాధాన్యత పెరుగుతోంది.
Also Read: కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు..?
కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా ఉద్యోగాలు చేసే ఉద్యొగులు వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. మొబైల్ వెర్షన్ తరహాలోనే వెబ్ వెర్షన్ లో ఈ ఫీచర్ వినియోగించుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ తెలిపింది. వీడియో కాల్స్ వస్తే విండో పాపప్ ఓపెన్ అవుతుందని.. ఔట్ గోయింగ్ కాల్స్ తో పాటు ఇన్ కమింగ్ కాల్స్ ను అటెండ్ చేయవచ్చని వాట్సాప్ ప్రకటన చేసింది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
రోజురోజుకు ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ యాప్ కొత్త ఫీచర్ల ద్వారా నంబర్ 1 మెసేజింగ్ యాప్ గా నిలుస్తోంది. వాట్సాప్ పేమెంట్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెస్తూ ఉండటంతో యూజర్లు వాట్సాప్ యాప్ ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.