దేశంలోని నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. మొదట ఈ నెల 17వ తేదీ వరకే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సర్వర్ల మొరాయింపు వల్ల దరఖాస్తు గడువును పొడిగించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటం, అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త.. ఆన్ లైన్ లో టెట్..?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మొత్తం 4,726 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇంటర్ పాసై 27 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
Also Read: ఎమ్మెస్సీ అభ్యర్థులకు బార్క్ శుభవార్త.. రూ.40,000 స్టైఫండ్ తో ఫెలోషిప్..?
19వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉండగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2020 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీలోగా ఆన్ లైన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2021 సంవత్సరం ఏప్రిల్ 12 నుంచి 27 వరకు టైర్ 1 పరీక్షలు జరుగుతాయి. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం
చిన్న వయస్సులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావాలనుకునే వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్ 1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్ 2 పరీక్షలకు ఎంపికవుతారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.