https://oktelugu.com/

కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. వారికి మరింత ముప్పు..?

కరోనా మహమ్మారి విజృంభించి సంవత్సరం గడిచినా వైరస్ గురించి ప్రజల్లో భయాందోళన ఏ మాత్రం తగ్గలేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నా ప్రజలందరికీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ జరిగేంత వరకు కరోనా ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైనా శాస్త్రవేత్తలు కరోనా గురించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. Also Read: కరోనా వైరస్ ఉన్నంత కాలం మనవాళి ప్రమాదంలో ఉన్నట్లేనా? చైనా రాజధాని బీజింగ్ కు చెందిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 17, 2020 / 08:10 PM IST
    Follow us on


    కరోనా మహమ్మారి విజృంభించి సంవత్సరం గడిచినా వైరస్ గురించి ప్రజల్లో భయాందోళన ఏ మాత్రం తగ్గలేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నా ప్రజలందరికీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ జరిగేంత వరకు కరోనా ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైనా శాస్త్రవేత్తలు కరోనా గురించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

    Also Read: కరోనా వైరస్ ఉన్నంత కాలం మనవాళి ప్రమాదంలో ఉన్నట్లేనా?

    చైనా రాజధాని బీజింగ్ కు చెందిన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి అధ్యయనం చేసి కీలక విషయాలను వెల్లడించారు. కంప్యూటర్ సిమ్యులేషన్ ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం ఇరుకైన మార్గాలు ఉన్న ప్రాంతాల్లో వెళ్లే పిల్లలకు కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇరుకు ప్రాంతాల్లో కరోనా రోగులు వెళ్లిన సమయంలో దగ్గినా, తుమ్మినా ఆ కణాలు గాలిలో నడుము ఎత్తులో ప్రయాణిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

    Also Read: దేశ ప్రజలకు శుభవార్త.. ఆ వ్యాక్సిన్ తో రెండేళ్లు ఇమ్యూనిటీ పవర్..?

    విశాల మార్గాలతో పోలిస్తే ఇరుకు మార్గాల్లో గాలి ప్రసరణ సరిగ్గా ఉండదని అందువల్ల అక్కడ ఉండే వాళ్లు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇరుకు మార్గాల గుండా పిల్లలు ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇరుకు మార్గాల గుండా ప్రయాణించే సమయంలో మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

    మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

    వైరస్ గురించి రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో టెన్షన్ ను మరింత పెంచుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ఎక్కువ రోజులు పట్టదని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.