https://oktelugu.com/

WhatsApp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ వాడుతున్నారు. దీనివల్ల గ్రూపుల సంఖ్య పెరిగిపోయింది. ఇదే సమయంలో మెసేజ్ లు కూడా ఎక్కువైపోయాయి. దీంతో వాట్సాప్ ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా మెసేజ్ లు వస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 22, 2024 4:30 pm
    WhatsApp

    WhatsApp

    Follow us on

    WhatsApp: బిలియన్ల కొద్దీ యూజర్లతో.. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ గా పేరుపొందిన వాట్సప్.. మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల తరచూ మార్పులు, చేర్పులు చేస్తున్న వాట్సప్ యాజమాన్యం.. యూజర్ ఫ్రెండ్లీ కోసం సరికొత్త ఫీచర్లను తెరపైకి తీసుకువస్తోంది. అందులో భాగంగానే క్లియర్ ఆన్ రీడ్ మెసేజ్ కౌంట్ పేరుతో.. మరో ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఇది ఎలా పని చేస్తుందంటే..

    స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ వాడుతున్నారు. దీనివల్ల గ్రూపుల సంఖ్య పెరిగిపోయింది. ఇదే సమయంలో మెసేజ్ లు కూడా ఎక్కువైపోయాయి. దీంతో వాట్సాప్ ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా మెసేజ్ లు వస్తున్నాయి. ఇలాంటి మెసేజ్ లు చదవాలంటే యూజర్లకు చాలా ఇబ్బంది అవుతోంది. పైగా దానివల్ల ఫోన్ పనితీరు కూడా ప్రభావితమవుతోంది. ఈ నేపథ్యంలో యూజర్లు చదవని మెసేజ్ లను.. వారు యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా క్లియర్ అయ్యేలాగా “క్లియర్ అండ్ రీడ్ మెసేజ్ కౌంట్ ” పేరుతో వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీనివల్ల అన్ రీడ్ మెసేజ్ ల కౌంట్ చాట్ లో చూపించదు. దీనికోసం వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ లో ఆప్షన్ తీసుకురానుంది. యూజర్లు తమ ఇష్టం ప్రకారం దానిని ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసుకోవచ్చు. ఎక్కువగా మెసేజ్ లు వచ్చే వారికి ఈ ఫీచర్ ఉపయుక్తంగా ఉంటుంది.

    అంతకుముందు వాట్సప్ అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.. యూజర్లను పెంచుకునే క్రమంలో సరికొత్త మార్పులకు, చేర్పులకు శ్రీకారం చుట్టింది. గ్రీన్ కలర్ లోగోను కాస్తా పైకి జరిపి.. బ్యాక్ గ్రౌండ్ ను వైట్ గా మార్చింది. అంతేకాకుండా అప్డేట్స్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. వాట్సప్ ఛానల్ అనే ఫీచర్ ను ఆవిష్కరించింది. స్కానర్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. డబ్బు చెల్లింపు నుంచి వీడియో కాల్ వరకు.. ఇలా అన్నింటిని చేసుకునే విధంగా వాట్సప్ యూజర్ ఫ్రెండ్లీగా మారింది. ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చిన ఫీచర్ పట్ల యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.