America: అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం

జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ అమెరికన్‌ విద్యార్థులు మృతిచెందారు. వీరిని శ్రీయ అవసరాల, ఆర్యన్‌ జోషి, అన్వీశర్మగా గుర్తించారు.

Written By: Raj Shekar, Updated On : May 22, 2024 4:34 pm

America

Follow us on

America: ఉన్నత చుదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు పలు కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నో కలలతో భవిష్యత్‌ నిర్మించుకునేందుకు అమెరికా బాట పడుతున్న యువత అకాల మరణాలు తల్లిదండ్రులు కలవరపడుతున్నాయి. కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మే 14న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జార్జియాలో యాక్సిడెంట్‌..
జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ అమెరికన్‌ విద్యార్థులు మృతిచెందారు. వీరిని శ్రీయ అవసరాల, ఆర్యన్‌ జోషి, అన్వీశర్మగా గుర్తించారు. రిత్విక్‌ సోమేపల్లి, మహ్మద్‌ లియాఖత్‌ అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి అల్ఫారెట్టాలోని నార్త్‌ ఫుల్టన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా జార్జియా యూనివర్సిటీలోని సీనియర్‌ అల్ఫారెట్టా హైస్కూల్‌ విద్యార్థులు. యాక్సిడెంట్‌ సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అదుపు తప్పి చెట్టును ఢీకొని..
ఐదుగురు వెళ్తున్న ఈ కారు.. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడింది. ఈ ఘటనలో ఆర్యన్‌ జోషి, శ్రీయా అవసరాల అక్కడికక్కడే మృతిచెందారు. అన్వీ శర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

అద్భుత డ్యాన్సర్‌ అన్వీశర్మ..
అన్వీశర్మ మృతికి కళాకార్‌గ్రూప్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది శ్రియ అవసరాల కూడా అద్భుతమైన డ్యాన్సర్‌ అని షికారీ గ్రూప్‌ సంతాపం తెలిపింది. శ్రియ అవసరాల యూజీఏ సికారి డ్యాన్స్‌ టీమ్‌లో సభ్యురాలు. అలాగే అన్వీశర్మ యూజీఏ కళాకార్, కాపెల్లా బృందంలో సింగర్‌గా ఉన్నారు. ఇక ఆర్యన్‌ జోషి క్రికెటర్‌గా రాణిస్తున్నాడు. కీలక పోటీల్లో జట్టు విజయానికి కారణమైన అతని మరణం తీరని లోటని అల్పారెట్టా హై క్రికెట్‌ జట్టు ఇన్‌స్టా పోస్టులో విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండా గత నెల అరిజోనాలోని లేక్‌ ప్లెసెంట్‌ సమీపంలో పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.