New moon near Earth: సౌర కుటుంబంలో భూమితో పాటు మరో ఎనిమిది గ్రహాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రతి గ్రహం సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ఇదివరకే తెలుసుకున్నాం. అయితే భూమి చుట్టూ మాత్రం చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు భూమి చుట్టూ మరోచంద్రుడు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ చంద్రుడు పేరే ‘అర్జున 2025 PN7 ‘. ఇది భూమి చుట్టూ చిన్న ఆస్టెరాయిడ్ లాగా తిరుగుతూ ఉన్నట్లు గ్రహించారు. అసలు ఈ గ్రహం ఏమిటి? దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
సాధారణంగా భూమికి గురుత్వాకర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. దీంతో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ భూమి చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించే PN 7 సూర్యుని చుట్టూ భూమి మాదిరిగానే తిరుగుతూ ఉంటుంది. అయితే ఇది భూమితో పాటు సమానంగా తిరుగుతూ ఉండడం విశేషం. ఈ కొత్త గ్రహాన్ని 2025 సంవత్సరం ఆగస్టులో కనుగొన్నారు. ఫ్యాన్ స్టార్ ఆర్ ఎస్ 1 అనే టెలిస్కోప్ ఉపయోగించి ధృవీకరించారు. ఈ గ్రహం అర్జున ఆస్టెరాయిడ్ సమూహానికి సంబంధించినది. ఇది అచ్చం భూమి లాగే ఉంటుంది. తక్కువ వాళ్లు కలిగి దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. ఇది సుమారు 19 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటున్నట్లు గుర్తించారు. అయితే దీనిపై ఎలాంటి కాంతి ఉండదు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 60 సంవత్సరాలుగా ఈ గ్రహం భూమికి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఇది 2080 వ సంవత్సరం వరకు ఉంటుందని చెబుతున్నారు.
సాధారణంగా కొన్ని ఉపగ్రహాలు ఇలా వచ్చి అలా వెళ్తుంటాయి. అయితే దీనికి మరోచంద్రుడు అని పేరు పెట్టినా.. చంద్రుడివలె శాశ్వతంగా ఉండదు. కొన్నాళ్లపాటు ఉండి అవి మాయమైపోతుంటాయి. ఈ గ్రహం భూమికి దాదాపు 2,99,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. 1991లో స్పేస్ వాచ్ అనే గ్రహాన్ని కనుగొన్నారు. ఇప్పుడు కొత్తగా మరో గ్రహం అందుబాటులోకి వచ్చింది. భూమికి దగ్గరగా దాదాపు 100 కంటే ఎక్కువగా గ్రహ శకలాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని అర్జున గ్రహ శకలం బెల్ట్ అని అంటారు. అర్జున గ్రహ శకలాలు భూమితో ప్రతిధ్వనిలో కదులుతున్నప్పుడు అవి గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండవు. అలాగే ఈ కొత్తగ్రహం కూడా భూమి చుట్టూ తిరుగుతుంది. కానీ భూమిపై పడే అవకాశం ఉండదు.