YS Jagan comments on Balakrishna: వర్షా కాలం అసెంబ్లీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పై వేసిన సెటైర్లు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాజీ సీఎం జగన్(YS Jagan) పై కూడా ఆయన నోరు పారేసుకున్నాడు. ఈ వ్యాఖ్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి మరియు జగన్ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. సొంత అన్నయ్య పై అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అని ఆయనపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలు రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలకు కూడా తెరలేపింది. అయితే బాలయ్య చేసిన ఈ కామెంట్స్ ని అసెంబ్లీ రికార్డ్స్ నుండి తొలగించారని టాక్. ఇదంతా పక్కన పెడితే నేడు బాలయ్య వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ మొట్టమొదటిసారి స్పందించాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.
జగన్ స్పందిస్తూ ‘పని పాటా లేని సంభాషణ ని బాలకృష్ణ అసెంబ్లీ లోకి తీసుకొచ్చాడు. అసలు ఆయన మాట్లాడాల్సినవి ఏంటి?,ఆయన తాగి మాట్లాడినది ఏంటి?. అసలు తాగినోడిని అసెంబ్లీ కి రానివ్వడం, అతనితో మాట్లాడించే కార్యక్రమం చేసినందుకు ముందు స్పీకర్ కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆయన్ని ఆయన ప్రశ్నించుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్ మీడియా లో నందమూరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోపక్క బాలయ్య కి అలాంటి కౌంటర్ ఇచ్చినందుకు మెగా ఫ్యాన్స్ ఆనందిస్తూ ఆ వీడియో ని వైరల్ చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు ఇప్పటి వరకు రెస్పాన్స్ ఇవ్వకపోవడం కూడా మెగా ఫ్యాన్స్ ని కాస్త నిరాశకు గురి చేస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ అంశం ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో అనేది.
బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు..
తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతిచ్చారు..?
పనీపాట లేని సంభాషణను బాలకృష్ణ తీసుకువచ్చాడు. ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతోంది
– మాజీ సీఎం వైఎస్ జగన్ https://t.co/T1HoYOi47I pic.twitter.com/Mnu3av9Psf— Telugu Feed (@Telugufeedsite) October 23, 2025