2026 Sankranthi Race: సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాల మధ్య పోటీ ఉంటుంది. ఇక పండగ సీజన్ లో వాళ్ళ సినిమాలను ఒకేసారి రిలీజ్ చేస్తూ ఎవరి సినిమా సక్సెస్ ను సాధించింది ఎవరి మీద ఎవరు గెలిచారు ఏ హీరో ఓడిపోయాడు అంటూ కొన్ని లెక్కలు సాగుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో 2026 సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. ఇప్పటికే రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నాడు, రవితేజ – కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా, అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు లాంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.
ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తోంది. తద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందగలుగుతోంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల మీదే అందరి చూపు ఉంది… ఇక ఈ మధ్యకాలంలో చిరంజీవి సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సక్సెస్ లను సాధిస్తున్నాడు… గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధించాడు.
ఇక అదే సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ మన శంకర్ వరప్రసాద్ సినిమాని కూడా సూపర్ హిట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు హారర్ విత్ కామెడీ తో తనను తాను మరోసారి ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పిస్తుందని అటు ప్రభాస్ , ఇటు తన అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పలు రికార్డ్ ను క్రియేట్ చేస్తూ సూపర్ హిట్ ను నమోదు చేస్తూ ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదంటూ చాలామంది సినిమా మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు… ఇక సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నప్పటికి చిరంజీవి – ప్రభాస్ సినిమాల మీద మాత్రం చాలా బజ్ క్రియేట్ అవుతోంది… చూడాలి మరి వీటిలో ఏ సినిమా సక్సెస్ ని సాధిస్తోంది. ఏ సినిమా డిజాస్టర్ గా మిగులుతోంది అనేది…