WhatsApp: ప్రపంచ వ్యాప్తంగా మూడు బిలియన్లకు మించిన యూజర్లతో వాట్సాప్ సరికొత్త మెసేజింగ్ యాప్ గా అవతరించింది. ఇప్పటికీ తన యూజర్లను పెంచుకుంటున్నది. అయితే వాట్సప్ ఉపయోగిస్తున్న వారికి శుభవార్త. త్వరలోనే యూజర్లు ఎగిరి గంతేసే అప్డేట్ ను వాట్సప్ యాజమాన్యం ఇవ్వనుంది. అంతేకాదు మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల ఇతర మెసేజింగ్ యాప్ వినియోగదారులతో చాట్ చేయవచ్చు. కాల్ చేసుకోవచ్చు. అయితే ఈ మార్పులు భారతదేశంలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఇది మాత్రమే కాకుండా మెసేజ్ లను ఒకే చోట లేదా వివిధ ఫోల్డర్లలో కలిసి చూసుకోవచ్చు. రియాక్షన్, రిప్లై, రీడింగ్, టైపింగ్, ఇండికేటర్ వంటివి ఇందులో అందుబాటులో ఉంటాయి. దీనిద్వారా యూజర్లకు సరికొత్త అనుభూతి కలుగుతుందని వాట్సాప్ యాజమాన్యం చెబుతోంది.
అందుబాటులోకి గ్రూప్ చాట్
ఇక వచ్చే ఏడాదిలో వాట్సాప్ యూజర్లు ఇతర యాప్ లు వినియోగించే వారితో గ్రూప్ చాట్ కూడా చేసుకోవచ్చు. అదే సమయంలో 2027లో ఇతర యాప్ వినియోగదారులతో వాయిస్, వీడియో కాల్స్ లోను మాట్లాడుకోవచ్చు. యూరప్ దేశాల్లో ఉన్న చట్టాల కారణంగా వాట్సాప్ యాజమాన్యం ఈ మార్పులను అందుబాటులోకి తీసుకొస్తోంది. భవిష్యత్ కాలంలో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల వాట్సాప్ యూజర్లు..ఇతర యాప్ లు వాడే వారితో చాట్ చేయగలుగుతారు. ఇతరులతోనూ సులభంగా అనుసంధానమవుతారు. వాట్సాప్ కు భారతదేశంలో మాత్రమే గాక ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనేక ఫీచర్లను వాట్సప్ జత చేసింది.
యూజర్లకు సరికొత్త అనుభూతి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వాట్సాప్ యూజర్లకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. అప్పటికప్పుడు డిజిటల్ చిత్రాన్ని రూపొందించుకోవచ్చు. తెలియని విషయం గురించి తెలుసుకోవచ్చు. మదిలో మెదిలే ఊహను టైప్ చేస్తే.. దానికి తగ్గట్టుగా ఫోటోను పొందొచ్చు. భవిష్యత్తులో జరగబోయే మార్పుల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఊహాతీతమైన ఆలోచనలకు రూపం ఇవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మార్పులను వాట్సాప్ తీసుకొచ్చింది. అందువల్లే యూజర్ల సంఖ్య పెరిగిపోతున్నారు. ఇవి మాత్రమే కాదు, భవిష్యత్తు కాలంలో ఇంకా ఎన్నో మార్పులను వాట్సాప్ చేపట్టనుంది.. తన యూజర్ల భద్రత కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.. మొదట్లో సాధారణ మెసేజింగ్ యాప్ గా పరిచయమైన వాట్సాప్.. దినదినం సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. యూజర్లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తోంది.. అందువల్లే ఆఫ్రికా నుంచి మొదలు పెడితే అమెరికా వరకు వాట్సాప్ విశేషమైన ఆదరణను పొందుతోంది.