https://oktelugu.com/

Sampoornesh Babu: హీరో సంపూర్ణేష్ బాబు ఏమయ్యాడు..? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు..? సినిమాలు ఆపేయడానికి కారణం అదేనా!

సినీ నటుడు అయినప్పటికీ సంపూర్ణేష్ బాబు ఎంతో సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటాడు. పంచె కట్టుకొని ఒక సాధారణ రైతు ఎలా అయితే పని చేస్తాడో, ఇప్పటికీ సంపూర్ణేష్ బాబు అలాగే పని చేస్తాడు. అంతే కాదు తాను సంపాదించిన డబ్బులతో తన తాహతకు తగ్గట్టుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు సంపూర్ణేష్ బాబు.

Written By:
  • Vicky
  • , Updated On : September 13, 2024 / 08:51 PM IST

    Sampoornesh Babu

    Follow us on

    Sampoornesh Babu: ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణం లో సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. కొత్తగా వచ్చే వాళ్ళు ఎదో ఒక స్పెషాలిటీ ని చూపించుకుంటేనే జనాలు వాళ్ళ వైపు చూస్తున్నారు. అలా విన్నూతనమైన రీతిలో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరో సంపూర్ణేష్ బాబు. ‘బేబీ’, ‘కలర్ ఫోటో’ వంటి అద్భుతమైన సినిమాలను టాలీవుడ్ కి అందించిన సాయి రాజేష్ నిర్మాణ సంస్థ ద్వారా సంపూర్ణేష్ బాబు హీరో గా ఇండస్ట్రీ లోకి ‘హృదయ కాలేయం’ అనే సినిమా ద్వారా లాంచ్ అయ్యాడు. విచిత్రమైన వేషాలతో సినిమా మీద రాజమౌళి లాంటి డైరెక్టర్స్ కూడా కామెంట్ చేసే విధంగా బజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. సినిమాల్లో వచ్చే కొని ఓవర్ సన్నివేశాలను స్పూఫ్ గా చేస్తూ సంపూర్ణేష్ బాబు చేసిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

    ఆ తర్వాత ఆయన అదే తరహా సినిమాలు చేసాడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి సంపూర్ణేష్ బాబు ఈమధ్య సడన్ గా ఏమయ్యాడు?, సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉండడం లేదు, సినిమాలు చేస్తున్నట్టు కూడా ఎక్కడ వార్తలు లేదు, ఎందుకు ఈ నిశబ్దం అని ఆయన గురించి పలువురు మీడియా చానెల్స్ విచారణ చేయడం మొదలు పెట్టారు. ఆయన చివరి సారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. తమిళం లో యోగి బాబు హీరో గా నటించిన ‘మండేలా’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది థియేటర్స్ లో విడుదలై మంచి రివ్యూస్ ని దక్కించుకుంది. కానీ ఈ సినిమా తర్వాత సంపూర్ణేష్ బాబు మళ్ళీ ఎలాంటి చిత్రంలోనూ కనిపించలేదు. అసలు సినిమాలు చేస్తున్నాడా?, లేదా మానేశాడా అనే విషయాన్ని విచారించగా ఆయన సినిమాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం రెండు సినిమాలు పూర్తి చేసాడట, అవి రెండు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయట. ప్రస్తుతం కాస్త ఖాళీ దొరకడం తో తన గ్రామం కి వెళ్లి పొలం పనులు చేసుకుంటున్నాడట.

    సినీ నటుడు అయినప్పటికీ సంపూర్ణేష్ బాబు ఎంతో సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటాడు. పంచె కట్టుకొని ఒక సాధారణ రైతు ఎలా అయితే పని చేస్తాడో, ఇప్పటికీ సంపూర్ణేష్ బాబు అలాగే పని చేస్తాడు. అంతే కాదు తాను సంపాదించిన డబ్బులతో తన తాహతకు తగ్గట్టుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు సంపూర్ణేష్ బాబు. ఇలాంటోళ్ళు ఇండస్ట్రీ లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలా మంచి మనసు కలిగిన సంపూర్ణేష్ బాబు మళ్ళీ ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలతో బిజీ అవ్వాలని ఆశిద్దాం. ప్రస్తుతం సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబు తో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని తీసే ఆలోచనలో ఉన్నాడట. ఇన్నాళ్లు కేవలం స్పూఫ్ జానర్ లోనే వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి, ఇక నుండి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తారట.