WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇకపై యూజర్లకు ఆ కష్టం ఉండదు..

WhatsApp ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే మొదట ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తుందని తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : June 16, 2024 10:50 pm

A new feature in WhatsApp.. Voice notes can be converted into text messages

Follow us on

WhatsApp : స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ వాట్సప్ ఉపయోగిస్తుంటారు. ఇటీవల కాలంలో దీని వినియోగం మరింత పెరిగింది.. కొత్త కొత్త నవీకరణలు జత చేయడంతో వాట్సప్ ఏకంగా మూడు బిలియన్ల యూజర్లతో.. నంబర్ వన్ సోషల్ మెసేజింగ్ యాప్ గా అవతరించింది. ఈ నేపథ్యంలో మరింత మంది యూజర్లను సొంతం చేసుకునేందుకు వాట్సాప్ అడుగులు వేస్తోంది. త్వరలోనే మరో కొత్త ఫీచర్ ను జోడించబోతోంది.

ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ లో మెసేజింగ్ సరికొత్త రూపు సంతరించుకోనుంది.. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్ ను టెక్స్ట్ మెసేజ్ గా మార్చుకోవచ్చట.. ప్రఖ్యాత web eta సమాచారం ప్రకారం త్వరలో వాట్సాప్ యూజర్లు తమ వాయిస్ నోట్ లను టెక్స్ట్ మెసేజ్ లుగా పంపవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. వాయిస్ కామెంట్ లేదా ఇంటర్వ్యూ వంటి వాటిని ఇతర యాప్ అవసరం లేకుండా సులభంగా టెక్స్ట్ మెసేజ్ ల రూపంలో పంపించవచ్చు.

అయితే ఈ ఫీచర్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి రాదు. దీనిపై వాట్సాప్ రకరకాల కసురత్తులు చేస్తోంది. ఇంకా ఇది టెస్టింగ్ దశలోనే ఉంది. వాయిస్ నోట్ ను టెక్స్ట్ రూపంలోకి మార్చేందుకు ఈ ఫీచర్ పై నిపుణులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. అయితే త్వరలో దీనిని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. స్పానిష్, హిందీ, పోర్చుగీస్, రష్యన్, ఇంగ్లీష్ తో పాటు అనేక భాషల్లో ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే మొదట ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తుందని తెలుస్తోంది.