Father’s Day : ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో తల్లి బిడ్డల రిలేషన్ షిప్ ని చూపిస్తూ చాలా సినిమాలు వచ్చాయి. అలా వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు తండ్రి బిడ్డల మధ్య ఉన్న రిలేషన్ షిప్ ని తెలియజేసే కొన్ని సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చి పెను సంచలనాన్ని సృష్టించాయి. అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా తండ్రి తన పిల్లల కోసం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఫైనల్ గా తన పిల్లల్ని వాళ్ల గోల్ కి రీచ్ అయ్యే విధంగా ఎలా మోటివేట్ చేశారు అనే పాయింట్ తో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
దంగల్
ఇక ఈ సినిమా గురించి మనం ఎంత ఎక్కువ చెప్పిన తక్కువే అవుతుంది. అమీర్ ఖాన్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తనకు పుట్టిన పిల్లలు కొడుకైన, కూతురైన ఇద్దరు సమానమే అని నమ్మే అమీర్ ఖాన్ జాతీయ క్రీడ టోర్నమెంట్ కి వెళ్లే విధంగా తన కూతుర్ని ప్రోత్సహించి పంపించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఎన్నో అవమానాలు ఎదురవుతున్న, ఇంకెన్నో ఇబ్బందులను తట్టుకొని మరి తన కూతురు ను అంతర్జాతీయ క్రీడా పోటీల్లోకి పంపించి గోల్డ్ మెడల్ సాధించే విధంగా ప్రోత్సహించిన తండ్రి గా అమీర్ ఖాన్ అద్భుతమైన నటనని చూపించాడు. ఇక తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న రిలేషన్ షిప్ ని ఈ సినిమాలో పూర్తిస్థాయిలో చూపించారు.
అంగ్రెజీ మీడియం
దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్ర వహించాడు. ఇక అమెరికాకు వెళ్లి చదువుకోవాలనే ఒక యువతి చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. ఆమె తండ్రి తన కోరికకు మద్దతును తెలిపి చాలామందితో పోరాడి మరి తనను అమెరికాకు ఎలా పంపించాడు అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమాగా గుర్తింపు పొందడమే కాకుండా తండ్రి కూతురు మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా డిఫరెంట్ వే లో చూపించారు…
పా
ఇక అమితాబచ్చన్ అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అనారోగ్యంతో ఉన్న తన కొడుకుని తండ్రి ఎలా రిసీవ్ చేసుకున్నాడు. అతనికి ప్రపంచం అంటే ఏంటో ఎలా పరిచయం చేశాడు. మనుషుల మధ్య ఉన్న గొప్పతనాన్ని ఏ విధంగా తెలియజేశాడు అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కడమే కాకుండా ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి ఒక కొత్త ఫీల్ అయితే అందించింది. ఇక తండ్రి కొడుకుల మధ్య ఉన్న రిలేషన్ షిప్ ని కూడా ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ గా చూపించారు.
రాజీ
రాజీ అనే సినిమా దేశం మీద ప్రేమతో తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన ఒక భారత గూడచారి కథను మనకు తెలియజేస్తుంది. ఇక ఈ సినిమా గురుంచి చాలా గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమాను తీశారు. సాహ్వాత్ తన తండ్రి మధ్య జరిగిన కొన్ని భావోద్వేగమైన క్షణాలు వాటి మధ్య ఏర్పరచుకున్న ఎమోషన్ సీన్స్ అనేవి ఈ సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి చేత కన్నులు పెట్టించే విధంగా ఉంటాయి..
వేకప్ సిద్
ఒక వ్యక్తి కి చదువు మీద ఆసక్తి లేక ఏం చేయాలో తెలియక నిస్సహాయ పరిస్థితుల్లో తన జీవితాన్ని తను కోల్పోయాను అని అనుకునే పరిస్థితి లో నుంచి తన తండ్రి ప్రోత్సాహం తో ఇష్టమైన ఫోటోగ్రఫీ నేర్చుకొని అందులో అద్భుతాలను ఆవిష్కరించాడు. ఫైనల్ గా తను ఎలా గెలిచి చూపించాడు అనేది చాలా క్లారిటీగా చూపించారు…ఇక ఇందులో కూడా తండ్రి కొడుకుల మధ్య చాలా మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి…