Car Driving Itself : డ్రైవర్ లేకుండానే బొంగరంలా తిరిగిన కారు.. అవాక్కయ్యే వైరల్ వీడియో

ఇప్పుడు టెక్నాలజీతో డ్రైవర్ లేకుండానే కార్లు నడిచే రోజులు వచ్చాయి. గూగుల్ సహా పలు టెక్నాలజీ సంస్థలు ప్రయోగాలు చేసి అలా కార్లను నడిపి కూడా చూపించాయి.

Written By: NARESH, Updated On : December 12, 2023 3:52 pm
Follow us on

Car Driving Itself  :  అప్పట్లో ఆదిత్య 369లో తొలిసారి తనకు తానే ఆలోచించి అమలు చేసే రోబోట్ లను చూసి అవాక్కయ్యాం.. కానీ ఇప్పుడు రోబోట్స్ కామన్ అయిపోయాయి. అత్యాధునిక రోబోలు వచ్చిపడ్డాయి. సొంతంగా ఆలోచించేవి వచ్చాయి. ఇప్పుడు ‘ఏఐ’ ఆధారిత రోబోలు ప్రపంచాన్నే మర్చేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ మనిషినే భయపెట్టే స్థాయికి ఎదిగింది.

ఇప్పుడు టెక్నాలజీతో డ్రైవర్ లేకుండానే కార్లు నడిచే రోజులు వచ్చాయి. గూగుల్ సహా పలు టెక్నాలజీ సంస్థలు ప్రయోగాలు చేసి అలా కార్లను నడిపి కూడా చూపించాయి.

అయితే ఈ ఆవిష్కరణలు అన్నీ కొట్టేసి తమదైన శైలిలో వాహనాలు తయారు చేస్తూ కాపీ కిడ్ గా పేరొందింది చైనా. అమెరికా ఆవిష్కరణలన్నీ తయారయ్యేది చైనాలోనే.. అలా టెక్నాలజీని ఒడిసిపట్టిన చైనా దేశం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీలతో కార్లు, ఇతర వాహనాలు, అంతరిక్ష ప్రయోగాలు కూడా చేస్తోంది.

అయితే చైనాలో ఓ కారు సుడులు తిరిగింది. డ్రైవర్ లేకుండానే బొంగరంలా తిరిగింది. ఆ డ్రైవర్ కారును ఇలా ఓ క్రాస్ రోడ్స్ వద్ద వాహనాలన్నింటిని ఆపేసి ఆపడానికి ప్రయత్నించినా అతడి వల్ల కాలేదు. కారు కింద ఏవేవో వేసిసి ఆపేయాలని చూసినా సాధ్యపడలేదు. చివరకు ఆ డ్రైవర్ చుట్టూ మధ్యలో ఉన్న కారు చుట్టూ పలు రౌండ్లు కొట్టేసి అదే కారుకు ఢీకొట్టి ఆగిపోయింది.

చైనాలోని నాన్‌టాంగ్‌లోని ఒక చౌరస్తా వద్ద తెల్లటి కారు ఇలా గింగిరాలు కొడుతూ డ్రైవర్ లేకుండానే తనకు తాను చుట్టూ తిరిగేసింది. చివరకు నల్లటి ఎస్.యూవీ కారును ఢీకొని ఆగిపోయింది. తెల్లటి ఎలక్ట్రిక్ కారు డ్రైవర్ తన వాహనాన్ని వలయాకారంగా తిరగడం ప్రారంభించిన తర్వాత దాని డ్రైవర్ ఆ కారును వెంబడించడం వీడియోలో కనిపించింది.

అయితే ఈ కారు ఇలా నడిరోడ్డుపై చౌరస్తా వద్ద రౌండ్లు కొట్టడానికి టెక్నికల్ ప్రాబ్లం కారణమట.. ఇది ఎలక్ట్రిక్ కారు అని.. ఏదో టెక్నికల్ లోపంతోనే ఇలా చేసిందట.. డ్రైవర్ లేకుండానే అది అలా రౌండ్లు కొట్టేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

వీడియోను కింది లింక్ లో చూడొచ్చు

https://www.msn.com/en-in/autos/news/driver-chases-after-his-car-after-it-starts-driving-in-circles-by-itself/vi-AA1lkw8s?ocid=socialshare#details

https://uk.news.yahoo.com/driver-chases-car-starts-driving-160000211.html