Migraine: ప్రస్తుత కాలంలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా తలకు ఒక వైపున మాత్రమే ఈ తలనొప్పి వస్తుంటుంది. తరుచూ వికారం, వాంతులు అయ్యే ఫీలింగ్ తో పాటు మైగ్రేన్ సమస్య ఉంటే తలలో ఓ పక్కన తీవ్రమైన నొప్పి లేదా జల్లుమన్నట్లుగా అనిపిస్తుంది.
సాధారణంగా వచ్చే తలనొప్పి కంటే మైగ్రేన్ తలనొప్పి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ వల్ల వచ్చే సమస్యని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చాలా కాలంగా మైగ్రున్ సమస్య ఉంటే దాన్ని సీరియస్ గా తీసుకోవాలని వైద్యులు తెలిపారు. మైగ్రేన్ సమస్యపై దృష్టి పెట్టకపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సకాలంలో సమస్యను వెంటనే గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
మైగ్రేన్ తలనొప్పి చాలా తీవ్రంగా ఉండటంతో పాటు ఒక వైపు మాత్రమే వస్తుంటుంది. వికారం, వాంతులతో పాటు వెలుతురుని చూడలేకపోవడం, కొంచెం శబ్దాన్ని కూడా తట్టుకోలేక పోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణం కన్పిస్తుంది.
అయితే మైగ్రేన్ సమస్యతో బాధపడే వారు కచ్చితంగా మందుకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంట. మద్యపానం చేసే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలో మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే మామూలుగా తలనొప్పి వస్తే చాలు కాఫీ, టీలను తాగుతుంటారు. కానీ ఈ విధంగా కాఫీ, టీలను తీసుకోకూడదు. వీటిల్లో కెఫిన్ ఉండటం వలన మైగ్రేన్ సమస్య ఎక్కువవుతుంది. అలాగే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు కూడా సమస్యను తీవ్రతరం చేస్తాయి. అందుకే ఇటువంటి పదార్థాలకు దూరంగా ఉండటం వలన మైగ్రేన్ పెయిన్ ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. అలాగే మైగ్రేన్ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మందులను రెగ్యులర్ వాడుతూ ఉండాలని వైద్యులు వెల్లడిస్తున్నారు.