కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు శుభవార్త చెప్పింది. 5జీ టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహించుకోవడానికి కేంద్రం టెలీకాం కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) మంగళవారం రోజున టెలీకాం సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతులను మంజూరు చేసింది. 5జీ ట్రయల్స్ కోసం దేశంలోని ప్రముఖ టెలీకాం కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి.
ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, టెక్నాలజీ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో కంపెనీలు ట్రయల్స్ ను నిర్వహిస్తుండటం గమనార్హం. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు సీడాట్, శాంసంగ్, నోకియా సంస్థలతో జతకట్టి ఈ ట్రయల్స్ ను నిర్వహిస్తుండటం గమనార్హం. కేంద్రం టెలీకాం కంపెనీలకు 5జీ ట్రయల్స్ కొరకు ఆరు నెలల గడువు ఇచ్చింది. వచ్చే రెండు నెలల్లో టెలీకాం కంపెనీలు ఉపకరణాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం టెలీకాం కంపెనీలకు పట్టణ ప్రాంతాలతో పాటు పాక్షిక పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో సైతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే డౌన్‌లోడ్ స్పీడ్ 4జీ కన్నా 10 రెట్లు పెరుగుతుందని తెలుస్తోంది. 5జీ సర్వీసులు దేశంలో అన్ని ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.
కేంద్రం 5జీ సర్వీసులకు అనుమతులు ఇవ్వడం వల్ల స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్లందరికీ ప్రయోజనం చేకూరనుంది. అన్ని ప్రాంతాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తే దేశం టెక్నాలజీపరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు అయితే ఉంటాయి.