తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న వైరస్ ఇదే.. జాగ్రత్తలు తప్పనిసరి..?

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడానికి డబుల్ మ్యూటెంట్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్చి నెల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు […]

Written By: Navya, Updated On : May 5, 2021 9:56 am
Follow us on

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడానికి డబుల్ మ్యూటెంట్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్చి నెల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.

కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు బి.1.617 వైరస్ ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలో సైతం డబుల్ మ్యూటెంట్ వల్లే కరోనా కేసులు భారీగా పెరగడం గమనార్హం. ఏప్రిల్ లో డబుల్ మ్యూటెంట్ బాగా వ్యాప్తి చెందుతోందని ఎన్440కే క్రమంగా కనుమరుగై డబుల్ మ్యుటెంట్ వైరస్ వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. మరోవైపు అందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 18 సంవత్సరాలు దాటిన వాళ్లు 60 శాతం ఉన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ నిదానంగా జరుగుతోంది. విదేశీ వ్యాక్సిన్లు పెద్దమొత్తంలో ఉత్పత్తి అయ్యే అవకాశాలు అయితే లేవు.

మరోవైపు కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి రావడానికి రెండుమూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కర్ఫ్యూలు, మీనీ లాక్ డౌన్ లు అమలులోకి వస్తుండటంతో చిరు వ్యాపారులు భారీ మొత్తంలో నష్టపోతున్నారు.