https://oktelugu.com/

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం శాటిలైట్ పార్ట్నర్ ఫిక్స్… ఏ ఛానల్ లో చూడొచ్చో తెలుసా?

హీరో నాని మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సరిపోదా శనివారం విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. కాగా సరిపోదా శనివారం శాటిలైట్ పార్ట్నర్ ఫిక్స్ అయ్యింది. మరి బుల్లితెర పై ఈ చిత్రాన్ని ఏ ఛానల్ లో చుడొచ్చో తెలుసుకుందాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 14, 2024 / 01:18 PM IST

    Saripodhaa Sanivaaram

    Follow us on

    Saripodhaa Sanivaaram: న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజినెస్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు నిర్మాతలు. నాని వరుస విజయాలతో జోరుమీదున్నాడు. దాంతో ఆయన చిత్రాలకు డిమాండ్ ఏర్పడింది. కాగా ‘ సరిపోదా శనివారం’ మూవీ టీవీ పార్ట్నర్ ని ఫిక్స్ చేసుకుంది.

    నాని కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. దసరా, హాయ్ నాన్న బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు ‘ సరిపోదా శనివారం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలు పెంచేస్తుంది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. యాక్షన్ సీన్స్ లో నాని పర్ఫామెన్స్ అద్భుతం అని చెప్పాలి. పైగా నాని క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

    నాని కి స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నట్లు చూపించారు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా కాకరేపుతుంది. థియేటర్లలో ఫ్యాన్స్ కి మాస్ జాతరే అనిపిస్తుంది. ఇక ‘ సరిపోదా శనివారం ‘ చిత్రం టెలివిజన్ పార్ట్నర్ ని కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకుంది. కాబట్టి కొద్దిరోజుల తర్వాత సరిపోదా చిత్రాన్ని జీ తెలుగులో చూసి ఎంజాయ్ చేయవచ్చు. సరిపోదా శనివారం చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో ‘ అంటే సుందరానికి ‘ అనే సినిమా వచ్చింది.

    అంటే సుందరానికీ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అంటే సుందరానికీ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ చిత్రం. నాని పెర్ఫార్మన్స్ కి మార్కులు పడ్డాయి కానీ, కాసులు రాల్లేదు. అందుకే ఈసారి రూటు మార్చి యాక్షన్ జోడించి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సరిపోదా శనివారం డివివి బ్యానర్ పై ప్రొడ్యూసర్ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్. జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జెక్స్ బెజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా సరిపోదా శనివారం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

    ఇక నాని గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. దసరా మూవీలో నాని డీగ్లామర్ రోల్ చేశారు. ఈ రివేంజ్ డ్రామా నాని కెరీర్లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. నాని-కీర్తి సురేష్ జంటగా నటించారు. హాయ్ నాన్న చిత్రంతో మరొక హిట్ ఖాతాలో వేసుకున్నాడు. మెల్లగా పుంజుకున్న హాయ్ నాన్న చిత్రం హిట్ స్టేటస్ అందుకుంది. మృణాల్ ఠాకూర్ తో నాని కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేసింది. సరిపోదా శనివారం విజయం సాధిస్తే నాని హ్యాట్రిక్ నమోదు చేసినట్లే. సరిపోదా శనివారం ఓ తెలుగు నవలకు కాపీ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.