తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల కుమ్ములాటలు తొలగడం లేదు. ముఖ్యంగా బెజవాడ వేదికగా టీడీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలు అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ముందే ఆ పార్టీలో గ్రూపు తగాదాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికార పార్టీ దూకుడును తట్టుకొని ఎంతో కొంత గెలుపు ఛాన్స్ ఉందననుకుంటున్న బెజవాడ నేతలు.. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు రోడ్డున పడ్డారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ప్రెస్ మీట్ పెట్టి.. కేశినేని నానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే.. ఇందుకు కారణాలు కూడా లేకపోలేవు. చంద్రబాబు విజయవాడలో ఎన్నికల ప్రచారం చేయబోతుండగా.. ఆయన రూట్ మ్యాప్ హఠాత్తుగా మారింది.
Also Read: బెజవాడలో తమ్ముళ్ల కుమ్ములాట.. టీడీపీ వర్సెస్ టీడీపీ
ఇలా రూట్‌మ్యాప్‌లో మార్పులు తెచ్చింది కేశినేని నానినే అని బుద్దా వెంకన్న, బొండా ఉమ రగిలిపోయారు. వెంటనే.. బోండా ఉమ ఇంట్లో బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా సమావేశం అయ్యారు. కేశినేని కావాలా.. అందరూ కావాలా.. చంద్రబాబు తేల్చుకోవాలని బోండా ఉమ అల్టీమేటం జారీ చేశారు. అంతే కాదు.. చంద్రబాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే తాము పాల్గొనేది లేదంటూ కేశినేని వ్యతిరేక వర్గంగా పేరు పడిన వారంతా తేల్చేశారు. ఎంపీ కేశినేనేనిపై వెంకన్న, ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read: జగన్ సీటుకు ఎసరు.. ఎంఐఎం అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీని కేశినేని సొంత జాగీరుగా వాడుకుంటున్నారని.. కుల సంఘంగా మారుస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తమ అధినేత.. కేశినేని నాని తమ హైకమాండ్ కాదన్నారు. కొద్ది రోజుల కిందట.. విజయవాడకు తానే హైకమాండ్‌ను అని కేశినేని చేసిన వ్యాఖ్యలకు వీరు కౌంటర్ ఇచ్చారు. పార్టీ కోసం తమ పోరాటం.. పదవుల కోసం కేశినేని ఆరాటమని.. వైసీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. విజయసాయిరెడ్డిని లంచ్‌కు సైతం పిలిచారన్నారు. కేశినేని నానిలా చీకటి రాజకీయాలు చేసే నైజం తమది కాదన్నారు. విజయవాడలో రెండు నియోజకవర్గాల్లో బుద్దా వెంకన్న, బొండా ఉమ బలమైన నేతలు కావడంతో.. కార్పొరేషన్ ఎన్నికల్లో వారి సహకారంపై అనుమానాలు ప్రారంభమయ్యాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఈ వివాదం ఒక్క సారిగా మీడియాలో సంచలనం సృష్టించడంతో చంద్రబాబు వెంటనే ఎంటర్ అయ్యారు. టెలికాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడారు. అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, వర్ల రామయ్య విజయవాడ నేతలందరితో మాట్లాడారు. విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేస్తామని.. శ్వేతను వెంట పెట్టుకుని ప్రచారానికి వెళ్తామని చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు రోడ్ షోలో కేశినేని నాని పాల్గొన్నా.. తాము కూడా పాల్గొంటామని చెప్పుకొచ్చారు. తనకు వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, బొండా ఉమ చేసిన వ్యాఖ్యలపై కేశినేని కూల్‌గా స్పందించారు. చంద్రబాబు చెబితే తక్షణమే రాజీనామా చేస్తానని.. రూట్ మ్యాప్ మార్పులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Tdp leaders war in vijayawada
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com