https://oktelugu.com/

Zimbabwe vs India : సంజూ వచ్చేసాడు.. అతడిక రిజర్వ్ బెంచ్ కే.. జింబాబ్వే తో మూడో టీ -20 కి భారత జట్టు ఇదే..

Zimbabwe vs India జూరెల్ కు తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. దానిని వినియోగించుకోలేకపోయాడు. దీంతో అతనిపై వేటువేయాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇక రెండవ టి20 మ్యాచ్ లో జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్ ప్లేస్ లో ఆల్ రౌండర్ శివమ్ దూబే కు జట్టులో అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు మార్పులు మినహా జట్టుకూర్పులో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2024 / 08:43 PM IST

    Zimbabwe vs India

    Follow us on

    Zimbabwe vs India : జింబాబ్వే టూర్ లో ఉన్న భారత యువ జట్టు.. మూడవ టి20 మ్యాచ్ కు సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్ లో ఓటమిపాలైన గిల్ సేన.. రెండవ టి20 మ్యాచ్లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. యువ ఆటగాడు అభిషేక్ శర్మ సెంచరీ కొట్టి జింబాబ్వే బౌలింగ్ ను ఊచకోత కోశాడు. జూలై 10న మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ లో 2-1 తో ముందంజ వెయ్యాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ కు ముందు తుది జట్టును ఎంపిక చేసే పనిలో కోచ్ లక్ష్మణ్, కెప్టెన్ గిల్ పడ్డారు. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో.. విక్టరీ పరేడ్ లో యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే పాల్గొన్నారు. దీంతో వారు జింబాబ్వే తో తొలి రెండు టీ 20 మ్యాచ్ లకు దూరమయ్యారు.

    వారి స్థానంలో బీసీసీఐ సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేష్ శర్మను జింబాబ్వే పంపించింది. ఇప్పుడు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివం దూబే అందుబాటులోకి రావడంతో.. వారి స్థానంలో జింబాబ్వేకు పంపించిన సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేష్ శర్మ ఇండియాకు తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు విషయంలో కెప్టెన్ గిల్, కోచ్ లక్ష్మణ్ కసరత్తు చేస్తున్నారు.. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న నేపథ్యంలో జైస్వాల్ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధృవ్ జూరెల్ స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులోకి వస్తాడని తెలుస్తోంది..

    జూరెల్ కు తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. దానిని వినియోగించుకోలేకపోయాడు. దీంతో అతనిపై వేటువేయాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇక రెండవ టి20 మ్యాచ్ లో జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్ ప్లేస్ లో ఆల్ రౌండర్ శివమ్ దూబే కు జట్టులో అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు మార్పులు మినహా జట్టుకూర్పులో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

    మూడవ టి20 మ్యాచ్ కు భారత జట్టు ఇదే (అంచనా మాత్రమే)

    గిల్ (కెప్టెన్), ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్, శివం దూబే, రియాన్ పరాగ్, రుతు రాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ.