NTR : రాముడి పాత్రలో మెప్పించిన ఎన్టీయార్…ఆ రెండు పౌరాణిక పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాడా..?

NTR ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ని ఎప్పటినుంచో ఒక రెండు పాత్రలు వెంటాడుతున్నాయట. అవేంటి అంటే ఒకటి కృష్ణుడి క్యారెక్టర్ కాగా, మరొకటి దుర్యోధనుడి పాత్ర...నిజానికి ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ లో కూడా చాలా బాగా నటిస్తాడు. 'జై లవకుశ' సినిమాలో ఎన్టీఆర్ చేసిన జై పాత్ర నెగిటివ్ షెడ్ లో ఉంటుంది. ఆ పాత్రలో కూడా ఆయన అలవోకగా నటించి మెప్పించడమే కాకుండా తన మార్క్ విలనిజాన్ని కూడా చూపించడంలో తను సక్సెస్ అయ్యాడు.

Written By: NARESH, Updated On : July 8, 2024 8:38 pm

Is NTR waiting for two mythological roles

Follow us on

NTR : నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర ‘ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ హీరో ఆయన హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

అయితే ఈ రెండు సినిమాలు ఆయనకు ఆశించిన విజయాన్ని అందిస్తాయనే నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలు సక్సెస్ లను తీసుకు వచ్చి పెడతయా తనను పాన్ ఇండియాలో స్టార్ హీరోని చేస్తాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దేవర సినిమా మీద బజ్ అయితే అంతగా లేదు. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా 1000 కోట్ల కు పైన కలెక్షన్లను వసూలు చేస్తుంది అనే నమ్మకం అయితే ఎవరిలో లేదు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుంది అనేది…

ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ని ఎప్పటినుంచో ఒక రెండు పాత్రలు వెంటాడుతున్నాయట. అవేంటి అంటే ఒకటి కృష్ణుడి క్యారెక్టర్ కాగా, మరొకటి దుర్యోధనుడి పాత్ర…నిజానికి ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ లో కూడా చాలా బాగా నటిస్తాడు. ‘జై లవకుశ’ సినిమాలో ఎన్టీఆర్ చేసిన జై పాత్ర నెగిటివ్ షెడ్ లో ఉంటుంది. ఆ పాత్రలో కూడా ఆయన అలవోకగా నటించి మెప్పించడమే కాకుండా తన మార్క్ విలనిజాన్ని కూడా చూపించడంలో తను సక్సెస్ అయ్యాడు.

ఇక చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగాడు. కాబట్టి తన చిన్నతనంలోనే బాల రామాయణం సినిమాలో నటించి రాముడుగా మెప్పించాడు. ఇక రాముడి పాత్రను చేసిన ఆయన తన ఎంటైర్ కెరియర్ లో ఎప్పటికైనా శ్రీకృష్ణుడు, దుర్యోధనుడి పాత్ర చేయాలని అందులో తన నట విశ్వరూపాన్ని చూపించాలని ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి తొందర్లోనే ఆయన అనుకున్న డ్రీమ్ నెరవేరుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…