Nagarjuna : చిరంజీవిని అవమానించిన ఎన్టీఆర్, నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్… ఇండస్ట్రీని షేక్ చేసిన వివాదం!

Nagarjuna కాగా ఎన్టీఆర్ టీనేజ్ లో చేసిన ఆ కామెంట్స్ కి పలుమార్లు పశ్చాత్తాప పడ్డారు. తెలిసీ తెలియని వయసులో అలా మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. చాలా కాలం క్రితమే ఆ వివాదం సమసిపోయింది. చిరంజీవి ఫ్యామిలీతో ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉంటారు.

Written By: NARESH, Updated On : July 8, 2024 9:30 pm

NTR who insulted Chiranjeevi... Nagarjuna's strong warning

Follow us on

Nagarjuna : జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనికి నాగార్జున సీరియస్ అయ్యాడు.ఏకంగా లైవ్ లో వార్నింగ్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి అంతటి హీరోని ఎన్టీఆర్ అవమానించడం అతిపెద్ద వివాదానికి దారి తీసింది. నందమూరి ఫ్యామిలీ మూడో తరం హీరో జూనియర్ ఎన్టీఆర్. తాత వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్ అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ కెరీర్ మొదలైంది. 2001లో నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి ఎన్టీఆర్ వయసు 17-18 ఏళ్ళు ఉంటుంది.

ఫస్ట్ మూవీ ప్లాప్. రెండో చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్. దర్శకుడు రాజమౌళి డెబ్యూ మూవీ అది. స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్. ఎన్టీఆర్ డాన్సులు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఎన్టీఆర్ పరిశ్రమ దృష్టిలో పడ్డాడు. ఆది చిత్రంతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 2002లో విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ కి మాస్ హీరో ఇమేజ్ తెచ్చింది. భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక సింహాద్రి తో ఎన్టీఆర్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. స్టార్ హీరోల సరసన చేరాడు.

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటికి ఎన్టీఆర్ వయసు 20 ఏళ్ళు కూడా దాటలేదు. చెప్పాలంటే టీనేజ్ నాటికే ఎన్టీఆర్ స్టార్ అయిపోయాడు. సింహాద్రి సక్సెస్ అనంతరం ఎన్టీఆర్ ఓ లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ మెగాస్టార్ చిరంజీనిని ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగింది. ఎన్టీఆర్ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. చిరంజీవి ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసిన అతి పెద్ద హీరో మా తాత ఎన్టీఆర్ మాత్రమే అన్నాడు.

లైవ్ ఇంటర్వ్యూ కావడంతో ఎన్టీఆర్ కామెంట్స్ నేరుగా ప్రసారం అయ్యాయి. వెంటనే ఎన్టీఆర్ కి కాల్ చేసిన నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. నీకంటే సీనియర్ హీరో గురించి నువ్వు మాట్లాడే తీరు ఇదేనా అని ఫైర్ అయ్యాడట. కాగా ఎన్టీఆర్ టీనేజ్ లో చేసిన ఆ కామెంట్స్ కి పలుమార్లు పశ్చాత్తాప పడ్డారు. తెలిసీ తెలియని వయసులో అలా మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. చాలా కాలం క్రితమే ఆ వివాదం సమసిపోయింది. చిరంజీవి ఫ్యామిలీతో ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉంటారు.