https://oktelugu.com/

Surya Kanguva : దసరా కానుకగా వస్తున్న సూర్య కంగువ కి థియేటర్లు దొరుకుతాయా..?

Surya Kanguva ఇంక బరిలో ఏ సినిమాలు నిలుస్తాయి అనేది క్లారిటీగా తెలియనప్పటికీ పెద్ద సినిమాలు సైతం పండగ సీజన్ ను క్యాష్ చేసుకోబోతున్నాయనే వార్తలైతే వస్తున్నాయి. మరి వీటన్నింటి మధ్యలో కంగువ సినిమాకి తెలుగులో ఎన్ని థియేటర్లు దొరుకుతాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఈ దసరా కి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి ఏ సినిమాలకు థియేటర్లు దక్కుతాయి అనేది...

Written By:
  • Gopi
  • , Updated On : July 7, 2024 / 07:43 PM IST

    Surya Kanguva movie release coming as Dussehra gift

    Follow us on

    Surya Kanguva : సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రతి సినిమా మేకర్స్ కూడా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే పండగ సీజన్ లో ప్రేక్షకులందరూ తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలుసుకుంటారు. కాబట్టి వారందరూ టైంపాస్ కోసం సినిమా చూడాలనే ఉద్దేశ్యం తో సినిమాకు వెళ్తారు. కాబట్టి ఫ్యామిలీ అంతా సినిమా చూసే అవకాశాలు ఉంటాయి. అలాగే హాలీడేస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి పండుగ సీజన్ లో ఒక వారం రోజులపాటు సినిమా జాతర అనేది జరుగుతుంది.

    కాబట్టి ఇలాంటి క్రమంలో రిలీజ్ అయిన సినిమాలకి మంచి రీచ్ దొరుకుతుంది. అలాగే కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తాయనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమం లో స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలను ముఖ్యంగా దసరా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చాటుకోవాలని చూస్తున్నాడు.

    ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కూడా తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే పండుగ సీజన్ ను బేస్ చేసుకొని తెలుగులో కూడా పలు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు గా తెలుస్తుంది.

    ఇంక బరిలో ఏ సినిమాలు నిలుస్తాయి అనేది క్లారిటీగా తెలియనప్పటికీ పెద్ద సినిమాలు సైతం పండగ సీజన్ ను క్యాష్ చేసుకోబోతున్నాయనే వార్తలైతే వస్తున్నాయి. మరి వీటన్నింటి మధ్యలో కంగువ సినిమాకి తెలుగులో ఎన్ని థియేటర్లు దొరుకుతాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఈ దసరా కి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి ఏ సినిమాలకు థియేటర్లు దక్కుతాయి అనేది…