ZIM Vs AFG: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టుల్లో రషీద్ ఖాన్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సొంతం చేసుకున్నాడు. మొత్తంగా 10 వికెట్ల ఘనతను అందుకున్నాడు. టెస్టులలో రషీద్ ఖాన్ గతంలో రెండు సార్లు 10 పది వికెట్ల ప్రదర్శన చేశాడు. రషీద్ ఖాన్ ఇప్పటివరకు 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో ఐదుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. మూడుసార్లు 10 వికెట్ల ప్రదర్శన కొనసాగించాడు. మొత్తంగా 44 వికెట్లు సొంతం చేసుకున్నాడు.. రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే జట్టు రెండవ టెస్టులో పరాజయం అంచులో ఉంది.. టార్గెట్ ఫినిష్ చేయడంలో జింబాబ్వే జట్టు తడబడుతోంది. ఇప్పటికీ లక్ష్యానికి ఇంకా 82 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం జింబాబ్వే జట్టు చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే జట్టు రెండవ ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది.. ఎర్విన్ (44), నగరవ(3) క్రీజ్ లో ఉన్నారు. జింబాబ్వే రెండో విన్నింగ్ లో కర్రన్ (38), సికిందర్ రజా(38) ఒక మోస్తరుగా పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. రెహమాన్ 2 వికెట్లు అందుకున్నాడు..
రెండవ ఇన్నింగ్స్ లో అద్భుతమైన బ్యాటింగ్..
ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. రహమత్ షా(139) సెంచరీ చేశాడు. ఇస్మత్ అలం (101) ఎనిమిదవ నెంబర్ లో బ్యాటింగ్ కు సెంచరీ కొట్టాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ రెండవ ఇన్నింగ్స్ లో 363 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ ఆరు వికెట్లు సాధించాడు. నగరవ మూడు వికెట్లు, సికిందర్ రజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ లో 243 రన్స్ చేసింది. సికిందర్ రజా(63), ఏర్విన్ (73) ఆఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివర్లో విలియమ్స్ (49) పరుగులతో మెరుపులు మెరిపించాడు.
తేమను ఉపయోగించుకుంటూ..
ఈ మైదానంపై తేమ ఎక్కువగా ఉండటంతో దానిని ఉపయోగించుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ అద్భుతం సృష్టించాడు. బంతిని మెలికలు తిప్పుతూ జింబాబ్వే ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. వెంట వెంటనే వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోకి తెచ్చాడు. అయితే ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రా అయింది. రెండో టెస్టులో ఫలితం తేలడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి ఎదురు కావద్దనుకుంటే.. జింబాబ్వే జట్టు గట్టి ప్రయత్నం చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటు లక్ష్యాన్ని సాధించాలి. అయితే ఇప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్న రషీద్ ఖాన్ ను అడ్డుకోవడం జింబాబ్వే ఆటగాళ్లకు సాధ్యమవుతుందా అనేది తేలాల్సి ఉంది.
Rashid Khan’s magical 6️⃣-wicket haul rattled the hosts as we head into an interesting final day with all to play for #ZIMvAFG : https://t.co/QPgjTJqItQ pic.twitter.com/3XXNnTxmLb
— Afghan Atalan (@AfghanAtalan1) January 5, 2025