Yuzvendra Chahal: కొంతకాలంగా టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్, అతడి సతీమణి ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమ ఖాతాలలో ఒకరినొకరు అనుసరించుకోవడం మానేశారు. దీంతో వారిద్దరు విడిపోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. జాతీయ మీడియా కూడా ఈ వ్యవహారంపై కథనాలను ప్రసారం చేస్తోంది. అయినప్పటికీ విడాకుల వ్యవహారంపై అటు చాహల్, ఇటు ధనశ్రీ ఇంతవరకు నోరు విప్పలేదు.
జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం చాహల్, ధనశ్రీ కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారట. ఇప్పటికే వారిద్దరూ తమ తమ న్యాయవాదులను సంప్రదించారట. త్వరలోనే మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటారని తెలుస్తోంది. మొన్నటిదాకా కలిసి ఉన్న వారిద్దరు.. అన్యోన్యంగా కనిపించిన వారిద్దరు విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఐపిఎల్ లో చాహల్ ఆడిన మ్యాచ్ లన్నింటికీ ధనశ్రీ హాజరైంది. ఆ మధ్య ధనశ్రీ పాల్గొన్న డ్యాన్స్ రియాల్టీ షో లోనూ చాహల్ కనిపించాడు. చివరికి చాహల్ ను ఎత్తుకొని ధనశ్రీ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సంచలనం అయిపోయింది. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించడం కలకలం రేపుతోంది.
అతని కోసమేనా?
ధనశ్రీ కొంతకాలంగా కొరియోగ్రాఫర్ ప్రతీక్ తో చనువుగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఆ ఫోటో బయటకి వచ్చినప్పటి నుంచే ధనశ్రీపై చాహల్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ” నువ్వు హద్దుల్లో ఉండు. అతడు పూర్తిగా నమ్మాడు. నువ్వేమో ఇలా చేస్తున్నావ్. నీకు ఎంత స్నేహితుడైతే మాత్రం ఇలా ఉంటావా? కొంచెం పద్ధతిలో ఉండు.. హద్దు మీరి ప్రవర్తిస్తే తదుపరి పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని” హెచ్చరించారు.
అయితే ఈ ఫోటో బయటికి వచ్చిన తర్వాతే యజువేంద్ర చాహల్ కూడా ధనశ్రీని మందలించాడట. దీంతో అప్పటి నుంచే వారిద్దరి మధ్య ఎడం పెరిగిందట. ఫలితంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.. మరోవైపు ధనశ్రీ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్. ఆమె అనేక సినిమాలకు కొరియోగ్రఫీ అందించింది. ఇటీవల డాన్స్ రియాల్టీ షోలో జడ్జిగా వ్యవహరించింది. ధనశ్రీని సోషల్ మీడియాలో లక్షల మంది అనుసరిస్తున్నారు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సంబంధించిన విషయాలను తనను అనుసరిస్తున్న వారితో పంచుకుంటారు.
ఇక చాహల్ కూడా ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా అతడు రికార్డ్ సృష్టించాడు. మిస్టరీ బౌలింగ్ వేయడంలో చాహల్ తర్వాతే ఎవరైనా. ఇతడిని మరో ముత్తయ్య మురళీధరన్ అని పేర్కొంటారు. ఇక ప్రస్తుతం చాహల్ తో విడాకుల ప్రస్తావన రావడంతో.. గతంలో ధనశ్రీ ప్రతీక్ తో దిగిన ఫోటో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది. అయితే దీనిపై చాహల్ అభిమానులు మండిపడుతున్నారు.. అతని వల్లే చాహల్ కు విడాకులు ఇస్తోందని ఆరోపిస్తున్నారు.