WTC 2025-27 Schedule: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయిన తర్వాత భారత జట్టుకు దాదాపు 6 నెలల పాటు విరామం లభించనంది. ఈయడది జూన్ నెల నుంచి భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2025-27 సీజన్ మొదలుపెట్టనుంది. ఇందులో భాగంగా జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్యలో ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ నెలలో వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టులలో తలపడుతుంది. నవంబర్, డిసెంబర్ నెలలో సౌత్ ఆఫ్రికా జట్టుతో రెండు టెస్టుల్లో పోటీ పడుతుంది. ఆ తర్వాత 2026 ఆగస్టు నెలలో శ్రీలంక జట్టుతో రెండు టెస్టులు ఆడుతుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాత 2027లో జనవరి నుంచి ఫిబ్రవరి నెలల మధ్యలో ఆస్ట్రేలియా తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడుతుంది. టీమిండియా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో దాదాపు 10 టెస్ట్ మ్యాచ్లో ఆడుతుంది. వచ్చే సీజన్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాలంటే టీమిండియా కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ సైకిల్లో టీమిండియా దాదాపు 18 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.
ఈసారి దారుణంగా విఫలం
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆవిర్భవించిన నాటి నుంచి టీమ్ ఇండియా రెండుసార్లు ఫైనల్ వెళ్ళింది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో.. రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్ వెళ్లాలని టీమ్ ఇండియా భావించింది. కానీ ఆట తీరు అత్యంత అధ్వానంగా ఉండడంతో వరుస ఓటములు తప్పలేదు. బంగ్లాదేశ్ సిరీస్ వరకు టీం ఇండియా అద్భుతంగా ఆడింది. కానీ ఎప్పుడైతే న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ లో దారుణమైన ఓటమిని మూటకట్టుకుందో.. అప్పుడే టీమిండియా పతనం మొదలైంది. అది ఆస్ట్రేలియాలో మరింత పరిపూర్ణమైంది. దీంతో తీశారు టీం ఇండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. అధికారికంగా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్ళింది. లార్డ్స్ లో జరిగే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఒకవేళ విజయం సాధిస్తే రెండోసారి ఈ ఘనత అందుకున్న జట్టుగా నిలుస్తుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గనుక గెలుపును సొంతం చేసుకుంటే.. తొలిసారి ఈ ట్రోఫీని అందుకున్న జట్టుగా ఆవిర్భవిస్తుంది. ఒకవేళ టీమ్ ఇండియా గనుక న్యూజిలాండ్ జట్టుపై గెలిచి.. ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధిస్తే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ వెళ్ళేది. అక్కడ దక్షిణాఫ్రికా జట్టుపై గెలుపును దక్కించుకుంటే తొలిసారి.. టెస్ట్ గదను అందుకునేది.