Yuvraj Advice Women Cricket Team: అప్పుడెప్పుడో కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత మరోసారి వరల్డ్ కప్ అందుకోలేకపోయింది. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో టీమిండియా 2003లో వరల్డ్ కప్ ఫైనల్ వెళ్లినప్పటికీ.. ట్రోఫీ అందుకోలేకపోయింది. తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.
Also Read: అండర్సన్ టెండుల్కర్ సిరీస్.. సరికొత్త చరిత్ర సృష్టించింది!
2003 తర్వాత టీమిండియా 2011 లో వరల్డ్ కప్ ఫైనల్ వెళ్ళింది. తుది పోరు ముంబై వేదికగా జరిగింది. లంకేయులతో హోరాహోరీగా సాగిన తుది పోరులో ధోని ఆధ్వర్యంలో టీమిండియా విజయం సాధించింది. తద్వారా దశాబ్దాల కలను టీమిండియా సాకారం చేసుకుంది. ఫైనల్ పోటీలో టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ వీరోచితమైన ఆటతీరు ప్రదర్శించాడు. లంకేయులపై ఎదురుదాడికి దిగాడు. అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ వీర లెవెల్లో దూకుడు కొనసాగించాడు. తద్వారా టీమిండియా దశాబ్దాలకలను నెరవేర్చాడు.
ప్రస్తుతం భారత వేదికగా మహిళల ప్రపంచకప్ మరి కొద్ది రోజుల్లో మొదలవుతుంది. ఇందులో భాగంగా భారత మహిళల జట్టును అన్ని విభాగాలలో సన్నద్ధం చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ తో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీమిండియా మహిళ క్రికెటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా యువరాజ్ తన అనుభవాలను మహిళా ప్లేయర్లతో పంచుకున్నాడు..
“2011 ప్రపంచ కప్ భారత్ వేదికగా నిర్వహించారు. ఆస్ట్రేలియా జట్టుపై సాధించిన విజయం తర్వాత మాలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఆత్మవిశ్వాసం పెరిగిన తర్వాత మేము రెట్టించిన ఉత్సాహంతో మిగతా జట్లతో ఆడటం మొదలుపెట్టాం. తదుపరి మ్యాచ్లకు సంబంధించి గ్యారి కిర్ స్టెన్, సచిన్ సమాలోచనలు జరిపేవారు. టీవీలకు దూరంగా ఉండాలని.. పేపర్లు చూడకుండా ఉండాలని సూచించేవారు.. ఇక మీరైతే సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలి. అందువల్ల మీరు పూర్తిస్థాయిలో ఆట మీద మనసు లగ్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మరింత సాధన చేస్తారు.. తద్వారా ఆటలో మరింత నైపుణ్యం సాధిస్తారని” యువరాజ్ వ్యాఖ్యానించాడు..
ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ సారధి మిథాలీ రాజ్ కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ 30 నుంచి భారత్ వేదికగా మహిళల వరల్డ్ కప్ మొదలవుతుంది. ఇంతవరకు టీమిండియా ఒకసారి కూడా వరల్డ్ కప్ సాధించలేదు. ఈసారి స్వదేశం వేదికగా తొలి వరల్డ్ కప్ సాధించాలని భారత మహిళల జట్టు ఉవ్విళ్ళూరుతోంది. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ నాయకత్వం వహిస్తోంది.