Yusuf Pathan: బిజెపిలో చేరితే చాలు.. నేతలు మొత్తం పులు కడిగిన ముత్యాలు అయిపోతారు. వారందరిని సర్ ఎక్సెల్ లో వేసి వెతికినట్టు.. శుభ్రం అయిపోతారు.. నేషనల్ పాలిటిక్స్ లో విస్తృతంగా చర్చలో ఉన్న మాటలు ఇవి. ఈ మాటలను పదేపదే కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు వాటికి బలం చేకూర్చే విధంగా బిజెపి మరోసారి వ్యవహరించింది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి.. ఇండియాకు జై కొట్టిన మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ విషయంలో బిజెపి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
యూసఫ్ పఠాన్ కు గుజరాత్ లోని తండల్జా ప్రాంతంలో 978 చదరపు మీటర్ల వివాదాస్పద భూమి ఉంది. ఈ భూమి విషయంలో పార్లమెంటు సభ్యుడు.. మాజీ క్రికెటర్ యూసఫ్ కు ఉపశమనం లభించింది. 978 చదరపు మీటర్ల స్థలంలో.. 478 చదరపు మీటర్ల స్థలాన్ని రాయితీ ధరతో అమ్మేందుకు గుజరాత్ ప్రభుత్వం ఒప్పుకుంది. యూసఫ్ టీఎంసీ నుంచి బయటికి వచ్చారు. ఎన్డీఏతో చేతులు కలిపారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఆయనకు 14 ఏళ్లుగా పోరాడుతున్న కేసులో అనుకూలంగా ఆదేశాలు జారీ అయ్యాయి.
దీనిపై వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ.. విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఈ ఫ్లాట్ కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందని.. ప్రతిపాదనను కమిటీ ముందు ఉంచామని.. కేటాయింపు చేపడతామని ఆయన అన్నారు. అయితే ఈ భూమి కోసం యూసఫ్ చెల్లించాల్సిన ధర ఇంకా ఖరారు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలి.. ధర మొత్తానికి నిర్ణయిస్తారని తెలుస్తోంది.
2012లో వడోదర ప్రాంతంలోని తండల్జా లో తన బంగ్లాను అనుకొని 978 చదరపు మీటర్ల స్థలాన్ని ఇంటర్నేషనల్ ప్లేయర్లకు పూట కింద తన కేటాయించాలని యూసఫ్ కోరారు. ఈ నేపథ్యంలో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కు ఒక లేక కూడా రాశారు. అయితే దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ బహిరంగ వేలం వేయలేదు. 99 సంవత్సరాల లీజుపై ఆ భూమిని అతనికి కేటాయించే విధానాన్ని ప్రారంభించింది 2014లో ఓపెన్ ఆక్షన్ లేకుండా ఆ స్థలాన్ని కేటాయించాలని వచ్చిన ప్రతిపాదనను గుజరాత్ రూరల్ డెవలప్మెంట్ పక్కన పెట్టింది.
యూసఫ్ ఆ స్థలం చుట్టూ గోడ నిర్మించారు. ఆ స్థలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారు. 2024 లో పార్లమెంటు ఎన్నికల్లో టీఎంసీ తరఫున యూసఫ్ గెలిచారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ స్థలం చుట్టూ ఉన్న ఆక్రమణకు తొలగించాలని వడోదర కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది.. దీనిపై యూసఫ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనను ఆక్రమణదారుడు అని పేర్కొంది. లీజ్ ఆర్డర్ లేకుండా స్థలాన్ని వాడుకోవడం నేరమని కోర్టు అభిప్రాయ పడింది.. మరోవైపు స్థలాన్ని కేటాయించే విధానాన్ని పరిశీలించాలని మరోసారి కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు ఆ పిటిషన్ పరిశీలించక ముందే యూసఫ్ దానిని వెనక్కి తీసుకున్నారు.