Yashsvi Jaiswal: అయితే కొంతకాలంగా జైస్వాల్ స్థిరమైన ఫామ్ ప్రదర్శించలేకపోతున్నాడు. దీనికి తోడు బిసిసిఐ సరికొత్త నిబంధనలు తీసుకురావడంతో అతడు రంజీలో ఆడుతున్నాడు. రంజీలో జైస్వాల్ ముంబై జట్టు తరుపున ఆడుతున్నాడు. అయితే ముంబై జట్టుతో అతడికి విభేదాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది.. అయితే ఇటీవల ముంబై – విదర్భ జట్ల మధ్య రంజీ ట్రోఫీకి సంబంధించి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై తరఫున జైస్వాల్ ఆడలేకపోయాడు. అతడి మోకాలికి గాయం కావడంతో ఆ మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో ముంబై జట్టు విదర్భతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఓటమిపాలైంది. ఈ ఓటమిని ముంబై జట్టు పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో అసోసియేషన్ పెద్దలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో జైస్వాల్, అసోసియేషన్ పెద్దల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జైస్వాల్ మనసు గాయపరచిందని.. అందువల్లే అతడు రంజీలో జట్టు మారాలని నిర్ణయించుకొన్నాడని తెలుస్తోంది. ముంబై జట్టు నుంచి గోవా జట్టుకు మారుతున్నట్టు సమాచారం. ” ముంబై జట్టుతో జైస్వాల్ విభేదాలు ఏర్పడ్డాయి. జైస్వాల్ తో ముంబై అసోసియేషన్ పెద్దలు గొడవ పడినట్టు తెలుస్తోంది. మనస్థాపానికి గురైన జైస్వాల్ ముంబై జట్టును వీడిపోయి గోవా జట్టుకు ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోందని” క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read: ఓరయ్యా మీకో దండం.. సిరాజ్ ను ఇలా తగులుకున్నారేంట్రా..
సూర్యకుమార్ ఏమన్నాడంటే..
జైస్వాల్ మాత్రమే కాకుండా ముంబై జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్ కూడా గోవాకు వెళ్ళిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని సూర్యకుమార్ యాదవ్ ఖండించాడు.. ” మీరు పాత్రికేయులా? లేదా రచయితలా? నేను హాస్య సంబంధమైన సినిమాలు చూడటం ఇకనుంచి మానేస్తాను.. మీరు రాసే ఆర్టికల్స్ చదవడం మొదలు పెడతాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా ఎలా రాస్తారు.. ఇలా రాస్తుంటే మీకు ఏమీ అనిపించడం లేదా.. క్రికెటర్ల కెరియర్ తో ఆటలు ఆడుకోమని మీకు చెప్పింది ఎవరు.. ఇలా అడ్డగోలుగా రాయమని మిమ్మల్ని ఆదేశించింది ఎవరు.. మీ వ్యూస్ కోసం.. ఇలాంటి చెత్త రాతలు ఎలా రాస్తారని” సూర్య కుమార్ యాదవ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా మండిపడ్డాడు. మరోవైపు సూర్యతో ఇంకా కొంతమంది క్రికెట్లో గోవా జట్టులో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ తో గోవా క్రికెట్ అసోసియేషన్ పెద్దలు సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని తిలక్ వర్మ ఖండించలేదు. అలాగని సమర్థించలేదు. తిలక్ వర్మ స్పందించేంతవరకు ఈ వార్తల ప్రవాహం ఆగేలా లేదు.. ఐతే తిలక్ వర్మ గోవా జట్టులో ఆడే అవకాశం లేదని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఎందుకంటే తిలక్ వర్మ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడుతున్నాడు. అలాంటప్పుడు అతడు గోవా జట్టులోకి వెళ్లే అవకాశం లేదని.. ముంబై రంజీ జట్టు పెద్దలతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.