Mohammed Siraj: ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అదరగొట్టాడు.. తనదైన బౌలింగ్ ప్రదర్శనతో అద్భుతం చేశాడు. (3/19) గణాంకాలతో నిప్పులు చెరిగాడు. తనదైన బౌలింగ్ తో దేవదత్ పడిక్కల్(devadat padikkal)(7), ఫిల్(Phil salt) సాల్ట్(14), లివింగ్ స్టోన్(living stone) (54) ను అవుట్ చేసాడు..పిచ్ అలవాటు అయినది కావడం.. సహకారం అద్భుతంగా లభించడంతో సిరాజ్ చిన్నస్వామి స్టేడియంలో మెరుపులు మెరిపించాడు. ప్రారంభం ఓవర్ నుంచే బెంగళూరు బాటర్లకు చుక్కలు చూపించాడు. వాస్తవానికి తొలి ఓవర్ లోనే బెంగళూరు ఓపెనర్ సాల్ట్ అవుట్ కావాల్సి ఉండేది. అయితే ఆ క్యాచ్ ను గుజరాత్ కెప్టెన్ బట్లర్ అందుకోలేకపోయాడు. అనంతరం తర్వాతి ఓవర్ లోనే పడిక్కల్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో సాల్ట్ ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంత బెంగళూరు 35 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఇక చివర్లో లివింగ్ స్టోన్ (54) దూకుడుగా ఆడుతున్న సమయంలో.. అతడిని కూడా సిరాజ్ పెవిలియన్ పంపించాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు లాస్ అయ్యి 169 రన్స్ చేసింది. బెంగళూరు జట్టులో జితేష్ శర్మ (33), టిమ్ డేవిడ్ (32) అదరగొట్టారు.. సిరాజ్ తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్ (2/22) రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.
నెట్టింట విమర్శల
ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ (2/34) అదరగొట్టాడు. అద్భుతమైన బంతితో రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో దారుణంగా పరుగులు ఇచ్చి ఈ సీజన్ ను నిరాశ జనకంగా మొదలుపెట్టిన సిరాజ్.. ఆ తర్వాత రెండు మ్యాచ్లలో ఆకట్టుకునే విధంగా ప్రదర్శన చేశాడు. సీజన్ వరకు బెంగళూరు జట్టు తరుపున సిరాజ్ ఆడాడు. బెంగళూరు తరఫున ఇటువంటి ప్రదర్శనను సిరాజ్ ఎప్పుడూ చేయలేదు. అయితే తాజా మ్యాచ్లో గుజరాత్ జట్టు తరుపున అద్భుతమైన ప్రదర్శన చేయడంతో బెంగళూరు అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.. అయితే కొంతమంది బెంగుళూరు అభిమానులు మాత్రం.. సిరాజ్ తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడని.. బెంగళూరు జట్టు ఆనుపానులు తెలుసు కాబట్టి.. ఇలా ఇబ్బంది పెడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా బెంగళూరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు బహుళ ప్రజాదరణ పొందిన సినిమాలలో కొన్ని దృశ్యాలను మార్ఫింగ్ చేసి.. సిరాజ్ ఫోటో పెట్టి మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో గుజరాత్ అభిమానులు మహమ్మద్ సిరాజ్ కు అండగా నిలుస్తున్నారు.