WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s premier league 2026) ప్రారంభ మ్యాచ్ లోనే అద్భుతం చోటుచేసుకుంది. అభిమానులకు, ముఖ్యంగా బెంగళూరు ఫ్యాన్స్ కు రెండు కళ్ళూ సరిపోలేదు. చూస్తున్నంత సేపు మైదానం మొత్తం ఊగిపోయింది. సాధారణంగా ఇండియన్ మైదానాలపై ఇండియన్ ప్లేయర్లు అదరగొడతారు. కానీ, ఆ సాంప్రదాయానికి దక్షిణాఫ్రికా ప్లేయర్ నదైన్ డిక్లెర్క్ చరమగీతం పాడింది. బౌలింగ్ లో నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా దుమ్ము రేపింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ మొదటి మ్యాచ్ ముంబై వేదికగా జరిగింది. డిపెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, ముంబై జట్లు ఈ మ్యాచ్లో తలపడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సజన 45, నికోలకేరి 40 పరుగులు చేసి అదరగొట్టారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 49 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు. బెంగళూరు బౌలర్లలో డిక్లెర్క్ 4/26 నాలుగు వికెట్లు పడగొట్టింది.
అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన బెంగళూరు జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. బెంగళూరు జట్టులో డిక్లెర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 44 బంతుల్లో 63* పరుగులు చేసింది. డిక్లెర్క్ ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ మెయిడ్ ఇన్ అయింది. లారెన్ బెల్ వేసిన ఈ ఓవర్లు అమేలీయ కేర్ (4) ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. అయితే స్మిత్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి కమలిని దూకుడు కొనసాగించింది. స్మిత్ తర్వాత ఓవర్ లో కూడా కమలని రెండు బౌండరీలు కొట్టింది. దీంతో ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై జట్టు 34 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం కమలిని, హర్మన్ ప్రీత్ కౌర్ (20) కలిసి మూడో వికెట్ కు 28 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరిని నాలుగు పరుగుల వ్యవధిలోనే అవుట్ చేసి బెంగళూరు అప్పర్హ్యాండ్ సాధించింది. ఈ దశలో కేరి, సజన జట్టును ఆదుకున్నారు. సజన 2, 4 పరుగుల వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్ లను హేమలత, సయాలీ వదిలిపెట్టారు. ఈ అవకాశాలను సజన వినియోగించుకుంది.
టార్గెట్ ఫినిష్ చేయడంలో అద్భుతమైన భాగస్వామ్యాలను బెంగళూరు జట్టు నమోదు చేసింది. హారీస్(25), స్మృతి మందాన (18) పరుగులు చేశారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యం అమలు చేశారు. ఆ తర్వాత ఏడు పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుట్ అయ్యారు. ఈ దశలో కూడా ముంబై బౌలర్లు పట్టు వదలలేదు. హేమలత (7), రాధా యాదవ్ (1), రీచా ఘోష్ (6) అవుట్ అయ్యారు. ఈ క్రమంలో డిక్లెర్క్, అరుంధతి రెడ్డి (20) సత్తా చూపించారు. ఆరో వికెట్ కు 52 పరుగులు జోడించారు. ఒకే ఓవర్లో అరుంధతి, శ్రేయాంక(1) అవుట్ అయినప్పటికీ.. డిక్లెర్క్ అద్భుతంగా ఆడింది. 4, 36, 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు డిక్లెర్క్ ఔట్ అయ్యేది. ముంబై ఫీల్డర్ల నిర్లక్ష్యం వల్ల లైఫ్ లు పొందింది. తద్వారా వచ్చిన అవకాశాలను వినియోగించుకొని బెంగళూరు జట్టును విజయ పదంలో నడిపించింది.
. . , Nadine de Klerk! ♀️
She clinches a famous victory for @RCBTweets in the #TATAWPL 2026 opener ❤️
Scorecard ▶️ https://t.co/IWU1URl1fr#KhelEmotionKa | #MIvRCB pic.twitter.com/5a9kjYJc2b
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026