POCO X7 Pro 5G: కొత్తగా మొబైల్ కొనేవారు నాణ్యమైన కెమెరా, మెరుగైన బ్యాటరీ ప్రధానంగా చూస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రముఖ కంపెనీ POCO ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన ఓ మొబైల్ లో ఈ రెండు హైలెట్ గా నిలుస్తున్నాయి. అంతేకాకుండా డిస్ప్లే తో పాటు ఇతర ఫీచర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ధర విషయంలోనూ వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయించారు. ఇంతకీ ఈ మొబైల్ లో ఏమేమి ఉన్నాయి? ధర ఎంతో? ఇప్పుడు చూద్దాం..
POCO కంపెనీ నుంచి లేటెస్ట్ గా POCO X7 Pro 5G మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో ప్రధానంగా డిస్ప్లే గురించి చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది LCD పానెల్తో ఉండడంతో ఆకర్షణీయమైన రంగులతో నాణ్యమైన వీడియోలను చూడవచ్చు. అంతేకాకుండా గేమింగ్ కోరుకునే వారికి కూడా అద్భుతమైన అనుభూతి వస్తుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయడంతో ప్రకాశవంతమైన వీడియోలో చూడవచ్చు.
ఇందులో బలమైన బ్యాటరీని అమర్చారు.6000 mAh బ్యాటరీ ఉండడంతో ఒక రోజంతా ఉపయోగించినా కూడా చార్జింగ్ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా డౌన్ టైం తక్కువగా ఉంటుంది. 90 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతో బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ పొందే అవకాశం ఉంటుంది. కెమెరా విషయంలోనూ ఈ మొబైల్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా 50 MP కెమెరాలు అమర్చారు. ఇది వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా అనుకూలమైన ఫోటోలను అందిస్తుంది. అలాగే అల్ట్రా వైట్ కెమెరా ఎటువంటి ఫోటోలను అయినా కావాల్సిన విధంగా అందిస్తుంది. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలోనైనా బ్రైట్నెస్ తో ఫోటోలు వస్తాయి. ఈ కెమెరాతో 4కె వీడియోలు సైతం రికార్డు చేసుకునే అవకాశం ఉంది. ఈ వీడియోలు అత్యధిక రిజల్యూషన్ ను అందిస్తాయి.
ఈ మొబైల్ లో 8400 Demensity అల్ట్రా వంటి సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయడంతో అత్యధిక వేగంగా బ్రౌజింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో 12gb ర్యామ్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ యూస్ చేసేవారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. 5జి కనెక్టెడ్ తో పాటు వైఫై ఇంటర్నెట్ కనెక్టింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించవచ్చు. ఇప్పటివరకు మార్కెట్లో Galaxy A56 ఇలాంటి ఫీచర్లనే కలిగి ఉంది. అయితే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన POCO X7 Pro 5G మొబైల్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే చాలామంది బ్యాటరీ మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఈ ఫోన్ ఏ మాత్రం తగ్గలేదు అని తెలుసుకోవచ్చు. ఈ మొబైల్ మార్కెట్లో రూ.23,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. రామ్ తో పాటు స్టోరేజీ అదనంగా కావాలనుకునే వారికి మరింత ధర పెరిగే అవకాశం ఉంది.