WPL 2025 : బెంగళూరు చేతిలో ముంబై ఓడిపోవడంతో.. ఢిల్లీ జట్టు ఫైనల్ వెళ్ళింది. వరుసగా మూడు సీజన్ల పాటు ఫైనల్ వెళ్లిన జట్టుగా ఢిల్లీ నిలిచింది. నిజానికి ముంబై జట్టు, ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో (పది పాయింట్లతో) సమానంగా ఉన్నాయి. కానీ రన్ రేట్ (0.396) తో ముంబై జట్టును(0.192) వెనక్కి నట్టుంది.. దీంతో ఢిల్లీ జట్టు తదుపరి పోటీలోకి వెళ్ళింది. ఢిల్లీ జట్టు పది పాయింట్లతో టాప్ స్థానంలో ఉంది. ఇక తాజాగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఆల్రౌండర్ ప్రదర్శన చేసింది. ఎట్టకేలకు గెలుపును దక్కించుకుంది. దీంతో బెంగళూరు ముంబై జట్టును 11 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. ముందుగా బెంగళూరు బ్యాటింగ్ చేసింది. మూడు వికెట్ల నష్టపోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ స్ప్రుతి మందాన (53), ఎలీస్ ఫెర్రీ (49*) సత్తా చాటారు. రీచా ఘోష్(36) అదరగొట్టింది. చివర్లో ఫెర్రీ, జార్జియా వేర్ హోమ్(31*) చెలరే గారు. దీంతో బెంగళూరు అంచనాల కందని పరుగులు చేసింది. బెంగళూరు జట్టు చివరి రెండు ఓవర్లలో 39 రన్స్ చేసింది. ముంబై బౌలర్లలో హెలి మాథ్యూస్(2/37) సత్తా చాటిది.
Also Read : నాట్ సీవర్ దంచి కొట్టింది.. గుజరాత్ బెంబేలెత్తిపోయింది
నాట్ సీవర్ అదరగొట్టినప్పటికీ..
చేజింగ్ లో నాట్ సీవర్ (69) దూకుడుగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ (20), యాస్తిక యాస్తిక(4), అమన్ జ్యోత్ కౌర్(17), కమలిని (6) తక్కువ పరుగులకే పేవిలియన్ చేరుకున్నారు. చివర్లో సజన (23) దూకుడుగా ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చేయాల్సిన లక్ష్యం పెరిగిపోవడంతో ముంబై జట్టు ఓటమి పాలు కాక తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 9 వికెట్లు నష్టపోయి 188 రన్స్ మాత్రమే చేయగలిగింది. స్నేహ్ రాణా(3/26), ఎలిస్ ఫెర్రీ (2/53), కిమ్ గార్త్ (2/33) దూకుడుగా బౌలింగ్ చేశారు. మరోవైపు గుజరాత్ జట్టుతో ముంబై గురువారం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. మరోవైపు బెంగళూరు జట్టు వరుసగా అయిదు ఓటములు ఎదుర్కొని ప్లే ఆఫ్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకుంది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెట్టినప్పటికీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. గత ఏడాది బెంగళూరు జట్టు అద్భుతంగా ఆడింది. ఛాంపియన్ గా ఆవిర్భవించింది. ఆ సీజన్లో బెంగళూరు విజేతగా నిలవడంతో.. ఐపీఎల్ లో బెంగళూరు పురుషుల జట్టుపై ఒత్తిడి పెరిగింది. అమ్మాయిల జట్టును చూసి నేర్చుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో దెప్పి పొడిచారు. మరి ఇప్పుడు అమ్మాయిల జట్టు ఓడిపోవడంతో.. త్వరలో ప్రారంభమయ్య ఐపిఎల్ లో బెంగళూరు పురుషుల జట్టు ఏం చేస్తుందో చూడాలి.