Syed Abid Ali : ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జై షా కొనసాగుతున్నారు. టీమిండియా క్రికెట్ ఈ స్థాయిలో విస్తరించడానికి.. ఇంతటి అభివృద్ధి చెందడానికి కారణమైన ఆటగాళ్లలో ఒకరైన సయ్యద్ అబీద్ అలీ (83) ఇక లేరు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ఆయన బుధవారం కన్నుమూశారు. వయోభారంతో ఇబ్బంది పడుతున్న ఆయన.. కొద్దిరోజుల క్రితమే ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. అబిద్ అలీ స్వస్థలం హైదరాబాద్ అయినప్పటికీ.. ఆయన కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడటంతో కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. ఆయన కుమారులు, కుమార్తెలు అమెరికాలో వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడే ఆస్తులు సంపాదించుకొని .. అమెరికన్ సిటిజన్షిప్ పొందారు. అబిద్ అలీకి పాతబస్తీలో ఒక ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. అబీద్ అలీ హైదరాబాదులో పుట్టారు. చిన్నప్పటినుంచి ఆయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆరోజుల్లో అంతగా సౌకర్యాలు లేకపోయినప్పటికీ ఆట మీద మక్కువ ఆయన విపరీతంగా ప్రాక్టీస్ చేసేవారు. నాడు క్రికెట్ ఇంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి.. ఆయన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. భారత జట్టులో ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా 1967 నుంచి 1975 వరకు భారత జట్టుకు విశేషమైన సేవలు అందించారు.
Also Read : అదే రోహిత్ కెప్టెన్సీలో గొప్పతనం.. అందువల్లే టీమిండియా గెలిచింది
లోయర్ ఆర్డర్ బ్యాటర్ గా..
అబిద్ అలీ పూర్వికులకు నిజాం ప్రభువులతో దగ్గర సంబంధాలు ఉండేవి. అబిద్ అలీ తండ్రి కూడా నిజాం ప్రభుత్వంలో పని చేసేవారు. ఆర్థికంగా అబిద్ అలీ కుటుంబం గొప్పగానే ఉండేది. ఆయన చదువు కూడా పేరుపొందిన పాఠశాలలోనే సాగింది. నాటి రోజుల్లో క్రికెట్ అంటే ఆర్థికంగా స్థిరంగా ఉన్న కుటుంబాలకు మాత్రమే పరిమితమయ్యేది. దీంతో అబిద్ క్రికెట్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవారు. మీడియం పేస్ బౌలింగ్ వేసేవారు. 1971లో ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుపై గెలిచింది. నాడు ఇంగ్లాండ్ జట్టు పై గెలిచిన భారత జట్టులో అబిద్ అలీ కీలక ఆటగాడు. అతడు తన కెరియర్లో 29 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 47 వికెట్లు పడగొట్టాడు. 1959 నుంచి 1979 వరకు హైదరాబాదులోని రంజీ జట్టుకు ఆడాడు. అనంతరం భారత జట్టుకు ఎంపిక అయ్యాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నాయకత్వంలో ఆస్ట్రేలియాపై అబిద్ అలీ తొలి టెస్ట్ ఆడారు. అబిద్ అలీ కన్నుమూసిన నేపథ్యంలో.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. ” అబిద్ అలీ గొప్ప ఆటగాడు. క్రికెట్ విస్తరణకు కృషి చేశారు. నాడు ఆయన క్రికెట్ పై విపరీతమైన మక్కువ పెంచుకొని జాతీయ జట్టులోకి ప్రవేశించారు. రంజీ లోను తన ప్రతిభ చూపించారు. జాతీయ జట్టులో 29 టెస్ట్ మ్యాచ్లు ఆడి.. 47 వికెట్లు పడగొట్టారు. నాడు ఏమాత్రం సదుపాయాలు లేని చోట ఆ స్థాయిలో బౌలింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా 1971లో ఇంగ్లాండ్ జట్టుపై ఓవల్ మైదానంలో భారత్ గెలిచిన టెస్ట్ మ్యాచ్లో అబిద్ అలీ కీలక సభ్యుడిగా ఉన్నారు. ఆయన క్రికెట్ కు చేసిన సేవలు అనన్యసామాన్యం. అటువంటి ఆటగాడిని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని” హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు సంతాపంలో పేర్కొన్నారు.