World Cup 2023: ఆ విషయం లో ఐపీఎల్ ని బీట్ చేయలేకపోయిన వరల్డ్ కప్ మ్యాచ్ లు…

ఇండియాలో డైరెక్ట్ గా మ్యాచ్ చూడాలని చాలామంది అభిమానులు కూడా కోరుకుంటారు అందుకే ఎక్కువ గా స్టేడియం లోకి వెళ్లి మ్యాచ్ చూస్తూ హంగామా చేస్తూ ఉంటారు.

Written By: Gopi, Updated On : November 22, 2023 8:51 am

World Cup 2023

Follow us on

World Cup 2023: క్రికెట్ అంటే ఏ దేశంలో ఎలా ఉన్నా కూడా ఇండియాలో మాత్రం దాని ఒక్క మతం లాగా స్వీకరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క అభిమాని క్రికెట్ మ్యాచ్ కోసం పడి చచ్చిపోతూ ఉంటారు. ఇక దానికి ఉదాహరణగా మొన్న వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోయిన వెంటనే చాలామంది అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. అలాగే మరి కొంతమంది అయితే హార్ట్ ఎటాక్ తో ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇలా ఇండియాలో క్రికెట్ అంటే అంత పిచ్చి…

ఇక ఇలాంటి క్రమంలో ఇండియాలో డైరెక్ట్ గా మ్యాచ్ చూడాలని చాలామంది అభిమానులు కూడా కోరుకుంటారు అందుకే ఎక్కువ గా స్టేడియం లోకి వెళ్లి మ్యాచ్ చూస్తూ హంగామా చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే మొన్న ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 92,453 మంది ఫైనల్ మ్యాచ్ ని చూడడానికి వచ్చి ఆ మ్యాచ్ ని చూస్తూ ఇండియన్ టీమ్ ను విపరీతంగా ఎంకరేజ్ చేశారు. అయితే అభిమానుల అందరు కోలాహలం చేస్తూ ఉండగా, మన ప్లేయర్లు మాత్రం అంత పెద్ద పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు చేసిన కొలాహలం మ్యాచ్ మధ్యలోకి వచ్చేసరికి తగ్గిపోయింది. ఇక చివరలో అయితే గ్రౌండ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది…ఇక ఈ నరేంద్ర మోడీ స్టేడియం 1,30,000 మంది కెపాసిటీ ఉన్న స్టేడియం కానీ ఇక్కడ 92,453 మంది మాత్రమే హాజరవడం విశేషం…

ఎందుకంటే చాలా మంది మాకు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడ్డానికి టికెట్లు దొరకట్లేదు అనే ఒక భావాన్ని వ్యక్తం చేశారు కానీ ఇక్కడ చూస్తే 92,000 మంది మాత్రమే హాజరవ్వడాన్ని చూసిన చాలా మంది మరి మిగితా టికెట్లను ఎందుకు అమ్మలేదు అని అందరూ తప్పు పడుతున్నారు…అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ టీమ్ ల మధ్య ఒక భీకరమైన పోరాటం జరిగింది. దాని కోసం1,01,566 మంది జనం మ్యాచ్ చూడటానికి హాజరయ్యారు.

ఐపీఎల్ తో పోల్చుకుంటే వరల్డ్ కప్ కి చాలా తక్కువ మంది జనం హాజరయ్యారు అనే చెప్పాలి. కొంతమంది కి టికెట్లు దొరకట్లేదు అని బాధపడుతుంటే మరింత కొంత మంది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి ఇంత తక్కువ మంది హాజరయ్యారు అని వాపోతున్నారు… ఏదేమైనా ప్రతి క్రికెట్ అభిమాని కనీసం వాళ్ల ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారి అయిన మ్యాచ్ ని స్టేడియంలో చూడాలి ఆ ఎంజాయ్ మెంట్ ని అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటారు…

ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన జనాన్ని చూస్తే 50 ఓవర్ల మ్యాచ్ చూసే కంటే 20 ఓవర్ల మ్యాచ్ అయిన ఐపీఎల్ కే జనాల్లో ఎక్కువ క్రేజ్ ఉంది అంటూ పలువురు క్రికెట్ మేధావులు కూడా చెప్తున్నారు…