Odi World Cup 2023: ఈసారీ ఎలాగైనా ఇండియన్ టీమ్ వరల్డ్ కప్పు కొడుతుంది అని ఇండియన్ అభిమానులు అందరూ అనుకున్నారు. కానీ ఇండియా వరల్డ్ కప్ కొట్టలేక పోయింది.ఇక భారతీయులంతా రెండు రోజుల నుంచి చాలా దుఃఖ సాగరంలో మునిగిపోతున్నారు. ఏదేమైనా బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అవతల వాళ్ళు చెప్పినంత ఈజీగా మనం ఆ మాట ని తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రస్తుతం క్రికెట్ అనేది ఇండియా లో ఒక ఎమోషన్ అయిపోయింది కాబట్టి అంత తొందరగా మర్చిపోలేక పోతున్నాం…
ఇక ఈసారి వరల్డ్ కప్ ఆల్మోస్ట్ ఇండియాకే వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్ లో ఇలా తేలిపోవడం అనేది బాధాకరమైన విషయం అనే చెప్పాలి.ఇక టి20 మ్యాచ్ ల కోసం యంగ్ టీమ్ ని అనౌన్స్ చేయడం జరిగింది.ఇక ఇది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. వీళ్ళిద్దరూ కూడా చాలా రోజుల నుంచి టి20 మ్యాచ్ లు ఆడకుండా ఎక్కువగా వన్డే మ్యాచ్ ల్లో మాత్రమే ఆడుతూ వస్తున్నారు.వన్డే వరల్డ్ కప్ ఈసారి ఎలాగైనా సరే దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇలా వాళ్ళు వన్డే లా మీద మాత్రమే ఫోకస్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా తో ఆడే 5 టి20 మ్యాచ్ లా కోసం బిసిసిఐ ప్లేయర్లను సెలెక్ట్ చేసింది. అయితే ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలి అనుకున్న కోహ్లీ, రోహిత్ శర్మ కి మాత్రం ఒక్క అడుగు దూరం లో కప్పు మిస్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.
ఎందుకంటే 2011వ సంవత్సరంలో కోహ్లీ వరల్డ్ కప్ వచ్చిన టీమ్ లో ఉన్నప్పటికీ అప్పుడు అతను అంత పెద్ద కీలకమైన ప్లేయర్ గా మాత్రం ఆ మ్యాచులు ఆడలేదు ఇప్పుడు ఆయన ఇండియన్ టీం లో కీలకమైన ప్లేయర్ కాబట్టి తన సత్తా ఏంటో చూపించి ఇండియా కి వరల్డ్ కప్ అందివ్వలని కోరుకున్నాడు కానీ అది కుదరలేదు.ఇక 2027 వరల్డ్ కప్ సమయానికి టీంలో ఆయన ఉండవచ్చు, ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఆయనకు 35 సంవత్సరాల వయసు ఉండడంతో నాలుగు సంవత్సరాలు ఉంటే 39 సంవత్సరాలు వస్తాయి.కాబట్టి అప్పటి వరకు వాళ్ల బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు.ఇక రోహిత్ కి అయితే ప్రస్తుతం 36 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి ఆయనకి అప్పటి వరకు 49 సంవత్సరాల వయసు వస్తుంది.
కాబట్టి ఆ టైంలో వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే టి20 మ్యాచ్ లు గాని, టి20 వరల్డ్ కప్ గాని ఆడటానికి యంగ్ ప్లేయర్స్ ఉన్నారు.ఇక ఈ టి20 వరల్డ్ కప్ చేయడం వల్ల ప్రస్తుతం మొత్తం టి20 మ్యాచ్ లు ఆడాల్సి వస్తుంది. అంటే దాదాపు సంవత్సరం వరకు వన్డే మ్యాచ్ లు ఆడకపోవచ్చు. ఇప్పుడు అన్ని దేశాలు కూడా టి20 వరల్డ్ కప్ మీదనే ఫోకస్ చేశాయి. కాబట్టి టి20 మ్యాచ్ ల మీద ఎక్కువగా ఫోకస్ పెడితే ఇలాంటి సమయంలో కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా రెస్ట్ తీసుకోవాల్సిందే అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి…
ఎందుకంటే టి 20 ల్లో ఆడటానికి చాలా మంది యంగ్ ప్లేయర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇక అవకాశం రాకపోవచ్చు… అయితే ఐపిఎల్ ఎలాగో ఆడతారు కాబట్టి ఐపిఎల్ లో వీళ్ళిద్దరూ వాళ్ళ సత్తాను చూపిస్తే కనక టి20 వరల్డ్ కప్ లో వీళ్లిద్దరు మళ్ళీ ప్లేయింగ్ 11 లో ఆడొచ్చు ఎందుకంటే ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఉంటే టీం కి కూడా ఎక్కువగా కలిసి వస్తుంది చూడాలి మరి వీళ్ళు టి 20 వరల్డ్ కప్ ఆడుతారా లేదా అనేది…
ఇక వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇండియన్ టీమ్ ని ఫైనల్ దాకా తీసుకొచ్చి ఫైనల్ లో గెలిపించలేక పోయాడనే ఒక అపవాదుని ఎదుర్కొంటున్నాడు. ఇక ఇలాంటి సమయంలో ఆయన పదవీకాలం కూడా ముగిసింది కాబట్టి బిసిసిఐ కోచ్ గా తనని తప్పించి వేరే కొత్త కోచ్ ని ఎంపిక చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…