https://oktelugu.com/

Nithiin: నితిన్ కోసం ఆ ప్లాప్ హీరోయిన్… రష్మిక, శ్రీలీల హ్యాండ్ ఇవ్వడంతో!

డేట్స్ లేవని సాకుగా చూపుతూ రష్మిక ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడికి కూడా సమయం కేటాయించలేకపోయింది. ఛలో మూవీతో రష్మికను టాలీవుడ్ కి పరిచయం చేసింది వెంకీనే.

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2023 / 08:56 AM IST

    Nithiin

    Follow us on

    Nithiin: నితిన్ కి హిట్ పడి చాలా కాలం అవుతుంది. భీష్మ అనంతరం మళ్ళీ సక్సెస్ తగల్లేదు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ ప్రేక్షకులను అలరించింది. చిరంజీవి సైతం ఆ సినిమాను మెచ్చాడు. వెంకీ కుడుములకు ఓ మూవీ ఆఫర్ కూడా ఇచ్చాడు. దాదాపు ఖాయమైన చిరంజీవి-వెంకీ కుడుముల మూవీ చివరి నిమిషంలో ఆగిపోయింది. దాంతో వెంకీ నితిన్ తో మూవీ కమిట్ అయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో భారీ చిత్రం ప్లాన్ చేశారు. అట్టహాసం ప్రకటించారు. రష్మిక మందాన హీరోయిన్. జీవీ ప్రకాష్ సంగీత దర్శకుడు.

    డేట్స్ లేవని సాకుగా చూపుతూ రష్మిక ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడికి కూడా సమయం కేటాయించలేకపోయింది. ఛలో మూవీతో రష్మికను టాలీవుడ్ కి పరిచయం చేసింది వెంకీనే. భీష్మ రూపంలో మరో హిట్ కూడా ఆమెకు ఇచ్చాడు. కారణం ఏదైనా వెంకీ కుడుముల-నితిన్ మూవీ నుండి రష్మిక మందాన తప్పుకుంది. దీంతో శ్రీలీలను తెచ్చారు. నితిన్ ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

    తాజాగా ఆమె కూడా తప్పుకుందని అంటున్నారు. శ్రీలీల చేస్తున్న ప్రాజెక్ట్స్ లో చాలా వరకు పూర్తి అయ్యాయి. భగవంత్ కేసరి ఇటీవల విడుదలైంది. ఆదికేశవ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయినట్లు సమాచారం. గుంటూరు కారం షూటింగ్ డిసెంబర్ కల్లా కంప్లీట్ అవుతుంది. విజయ్ దేవరకొండ మూవీ కూడా లిస్ట్ లో లేదట. ఇక నితిన్ తోనే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టైటిల్ తో ఓ మూవీ చేస్తుంది.

    ఈ లెక్కన ఆమె ఖాళీగానే ఉన్నట్లు లెక్క . మరి ఎందుకు నితిన్ మూవీ చేయడం లేదో తెలియడం లేదు. శ్రీలీల తప్పుకోగా ఆమె స్థానంలో నభా నటేష్ అనుకుంటున్నారట. వరుస ప్లాప్స్ లో నభా నటేష్ ఖాళీగా ఉంది. ఆమె చేతిలో ఒక్క సినిమా లేదు. గతంలో నితిన్ కి జంటగా మ్యాస్ట్రో చేసింది. నితిన్ కోసం ఇప్పుడు ఆమెనే తెస్తున్నారని అంటున్నారు. ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో కానీ ప్రముఖంగా వైరల్ అవుతుంది.