India Vs Pakistan: వరల్డ్ కప్‌లో కీలక మ్యాచ్ భారత్–పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో శనివారం ముగిసింది. ఈ మ్యాచ్ వార్ వన్‌సైడ్ అన్నట్లుగా సాగింది. పాకిస్తాన్ బౌలర్లను చితకొట్టి టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో వరల్డ్ కప్‌లో భారత్‌పై ఈసారి అయినా గెలిచి తీరాలన్నపాకిస్తాన్ కల నెరవేరలేదు. మరోవైపు వరల్డ్ కప్ గెలవకపోయినా పరవా లేదు.. పాక్‌పై గెలవాలన్న కసి భారత్ క్రికెట్ అభిమానుల్లో కనిపించింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు అనుకున్న ఫలితమే వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ క్రికెట్ అభిమానులను నవ్వించాయి. కొన్ని ఆశ్చర్యపర్చాయి.
కోహ్లీ మైదానంలో చిందులు.. అనుష్క ముసిముసి నవ్వులు..
విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తుంటాడు. వికెట్ పడ్డ ప్రతిసారి తానే తీసినంత ఆనంద పడతాడు. బ్యాటర్ ఎవరైనా కోహ్లీ సెలెబ్రేషన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక తాజాగా వన్డే ప్రపంచక‹ లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న పోరులో కూడా కోహ్లీ ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ ను చూడటానికి కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా స్టేడియానికి వచ్చేసింది. కోహ్లీ వికెట్ల సంబరాలను చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వింది. రివ్యూలో రవూఫ్ అవుట్ గా తేలిన తర్వాత కోహ్లీ తనదైన స్టయిల్ లో సెలిబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన అనుష్క్ శర్మ మురిసిపోయింది.
బుమ్రా వెరైటీ సెలబ్రేషన్స్..
నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన భారత్ – పాక్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆకట్టుకున్నారు. పేస్‌గన్ జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టాడు. ఈ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వికెట్ పడిన తర్వాత వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. బ్రెయిన్‌వైపు వేలు చూపిస్తూ బుమ్రా చేసుకున్న సెలబ్రేషన్స్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ప్రముఖ ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మార్కస్ రాష్‌ఫోర్డ్స్ సెలబ్రేషన్ స్టైల్‌ను అనుకరించాడు బుమ్రా. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఫార్వార్డ్ ప్లేయర్ మార్కస్ రాష్‌ఫోర్డ్ గోల్ కొట్టిన తర్వాత ఇలా థింకింగ్ మ్యాన్ సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. ఆ తరహాలోనే రాష్‌ఫోర్డ్ సెలబ్రేషన్ తీరును అనుకరించాడు బుమ్రా. బుమ్రా సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పేసు గుర్రం ఎవరిని ఇమిటేట్ చేశాడంటూ నెటిజన్లు గూగుల్ చేస్తున్నారు.
హార్దిక్ మౌన ప్రార్థన..
ఇక పాకిస్తాన్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా క్రికెట్ బంతితో చేసిన విచిత్రమైన, ప్రార్థన లాంటి చర్య వైరల్‌గా మారింది. ఇది పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్–ఉల్–హక్‌పై వికెట్ టేకింగ్ డెలివరీకి దారితీసింది. మ్యాచ్ 13వ ఓవర్‌లో, పాండ్యా బంతితో విచిత్రమైన దృశ్యం కనిపించింది. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్–ఉల్–హక్‌కు డెలివరీ చేయడానికి కొద్ది క్షణాల ముందు నిశ్శబ్ద ప్రార్థన లేదా మంత్రాన్ని జపిస్తున్నట్లు కనిపించాడు. తర్వాత బాల్‌కే ఇమామ్ ఉల్ హక్ 36 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. డ్రైవ్ చేసే ప్రయత్నంలో, ఎడమచేతి వాటం కలిగిన ఇమామ్–ఉల్–హక్ బంతిని ఎడ్జ్ చేశాడు, మరియు అది వికెట్ కీపర్ కేఎల్.రాహుల్ చేతికి చిక్కింది. ఈ వికెట్ కూడా గేమ్ చేంజ్‌గా మారింది.