ICC Odi Rankings: వన్డేల్లోనూ టీమిండియా నంబర్ 1.. అన్ని ఫార్మాట్లలోనూ టాప్ అంతే..

ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 116 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో పాకిస్తాన్‌∙(115), ఆస్ట్రేలియా(111) ఉన్నాయి. భారత్‌ ఇప్పటికే టెస్టులు, టీ 20ల్లో నంబర్‌ వన్‌ గా ఉంది.

Written By: Raj Shekar, Updated On : October 15, 2023 3:21 pm

ICC Odi Rankings

Follow us on

ICC Odi Rankings: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా మరోమారు నంబర్‌ వన్‌గా నిలిచింది. అన్ని ఫార్మాట్లలో భారత జట్టు నంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. అదే సమయంలో పాకిస్తాన్‌పై ఘన విజయంలో వరల్డ్‌ కప్‌ పాయింట్ల పట్టికలో కూడా కూడా టీమిండియా టాప్‌కు చేరుకుంది.
రెండు నెలల క్రితం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి వన్డే గెలిచిన భారత్‌.. అరుదైన రికార్డును సాధించింది. ఈ ఫలితంతో వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి నంబర్‌ 1 స్థానానికి చేరింది. ఇప్పటికే టెస్టు, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌.. వన్డేల్లో ఆ ఘనత అందుకుంది. ఫలితంగా అన్ని ఫార్మాట్‌లలో నంబర్‌ వన్‌ టీమ్‌గా నిలిచిన రెండో జట్టుగా నిలిచింది. తాజాగా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది.

రేటింగ్స్‌ ఇలా..
ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 116 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో పాకిస్తాన్‌∙(115), ఆస్ట్రేలియా(111) ఉన్నాయి. భారత్‌ ఇప్పటికే టెస్టులు, టీ 20ల్లో నంబర్‌ వన్‌ గా ఉంది. టీ20ల్లో 264 రేటింగ్‌ పాయింట్లతో భారత్‌ టాప్‌లో ఉండగా.. ఇంగ్లాండ్‌ (261), పాకిస్తాన్‌(254) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక టెస్టుల్లోనూ టీమిండియానే అగ్రస్థానంలో ఉంది. భారత్‌ 118 రేటింగ్‌ పాయింట్లతో ఉండగా, తర్వాత ఆస్ట్రేలియా 118, ఇంగ్లాండ్‌ 115 రేటింగ్‌ పాయింట్లతో ఉన్నాయి.

క్రికెట్‌లో రెండో జట్టు..
ఇలా అంతర్జాతీయ పురుషుల క్రికెట్‌లో ఓ జట్టు అన్ని ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టీ20) ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉండటం క్రికెట్‌ చరిత్రలో ఇది రెండోసారి. అంతకుముందు 2012 ఆగస్టులో దక్షిణాఫ్రికా జట్టు సైతం మూడు ఫార్మాట్లలోనూ నంబర్‌ వన్‌ జట్టుగా నిలిచింది. నంబర్‌ వన్‌ ర్యాంకుతో వరల్డ్‌ కప్‌లో అడుగు పెట్టిన టీమిండియా ఆ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకుంది.