Jasprit Bumrah: పై ఉపోద్ఘాతం మాదిరిగానే ఉంది టీమిండియా(Team India)లో బుమ్రా(bumrah) పరిస్థితి. బుమ్రా అద్భుతమైన బౌలర్.. అందులో సందేహం లేదు. మెరుపు వేగంతో బంతులు వేస్తాడు. అంతే వేగంతో వికెట్లను పడగొడతాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో ఏకంగా 32 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. సగటున 50 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. అందువల్లే అతడు వెన్ను నొప్పికి (Back pain) గురయ్యాడు. అందువల్లే సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేకపోయాడు. విపరీతమైన ఒత్తిడి.. నిరాటంకమైన బౌలింగ్ వల్ల బుమ్రా(Bhumra) అనారోగ్యానికి గురయ్యాడు. అయితే అతడికి ఇంగ్లాండ్ సిరీస్ కు రెస్ట్ ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావించింది. అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ(champions trophy) లో కూడా అతడు ఆడేది అనుమానమేనని తెలుస్తోంది. ఎందుకంటే అతని వెన్నునొప్పి ఇంతవరకు తగ్గలేదు. పైగా అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేది కష్టమే.
ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకోవాలి
ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగినప్పుడు.. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ (Boland) సాధించాడు. ప్యాట్ కమిన్స్ (Pat Cummins), మిచెల్ స్టార్క్ (Mitchel Starch), వంటి వారిని మించిపోయాడు. మెల్ బోర్న్, సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లలో ఆస్ట్రేలియా సాధించిన విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాలో కమిన్స్ కీలక బౌలర్ అయినప్పటికీ.. అనేక ప్రత్యామ్నాయలను ఆ జట్టు అందుబాటులో ఉంచుకుంది. అందువల్లే టీం ఇండియా పై విజయం సాధించగలిగింది. అదే టీమ్ ఇండియా విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా.. వంటివారు అందుబాటులో ఉన్నప్పటికీ.. వారెవరూ బుమ్రా తో సరితూగ లేకపోయారు. అయితే ఇప్పుడు బుమ్రా కు గాయం తగ్గే పరిస్థితి లేకపోవడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ లో టీమిండియా బౌలింగ్ దళానికి నాయకత్వం ఎవరు వహిస్తారు? అనే ప్రశ్న మొదలైంది. షమీ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. గాయం వల్ల ఏడాది కాలం అతడు రెస్టులోనే ఉన్నాడు. ఇటీవల దేశవాళి క్రికెట్ టోర్నీలో అతడు సత్తా చాటాడు. అయితే ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత.. అతడు మునుపటి లాగానే బౌలింగ్ చేస్తాడా.. ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటుతాడ అనేది ఒకింత ప్రశ్నార్థకమే. మహమ్మద్ సిరాజ్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఆకాష్ దీప్, హర్షిత్ రాణా వంటివారు ఆస్ట్రేలియా సిరీస్ లో పెద్దగా రాణించలేదు. మరి ఛాంపియన్స్ ట్రోఫీ లో వారు ఆకట్టుకుంటారా? ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో అదరగొడతారా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రత్యామ్నాయ బౌలింగ్ వనరులను టీమిండియా పెంపొందించుకోకపోతే కష్టమేనని.. తాజా ఉదంతాలు నిరూపిస్తున్నాయి.