Balayya and Chiranjeevi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇక ఇలాంటి దర్శకుడు పాన్ ఇండియా సినిమాలు చేయకుండా కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు…ఇక ఇప్పుడు ఆయన చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది…
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వాళ్లలో అనిల్ రావిపూడి ఒకరు. ప్రస్తుతం అయిన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఆయన వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఈ సినిమాతో తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు… ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఆ తర్వాత చిరంజీవితో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య బాబు తో చేసిన సినిమా లాంటిందే చిరంజీవితో చేయబోతున్నారా? అని అడిగితే దానికి సమాధానం ఇస్తూ బాలయ్య బాబు స్ట్రెంత్ వేరు, చిరంజీవి ఫాలోయింగ్ వేరు అంటూ చెప్పారు.
మొత్తానికైతే బాలయ్య బాబు తో భగవంత్ కేసరి అనే ఒక యాక్షన్ డ్రామా సినిమాని చేశారు. కానీ చిరంజీవితో మాత్రం అలాంటి సినిమాను చేయరట. వింటేజ్ చిరంజీవిని చూపిస్తూ ‘ఘరానా మొగుడు’ , ‘రౌడీ అల్లుడు ‘ లాంటి సినిమాలను చేయాలని తను కోరుకుంటున్నట్టుగా తెలియజేశాడు. మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడనే వార్త విన్న వెంటనే చిరంజీవి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
కారణమేమిటి అంటే అనిల్ రావిపూడి తో చిరంజీవి సినిమా చేస్తే మినిమం గ్యారంటీ సినిమాగా ఆడుతుంది. ఇక ఇప్పటి వరకు ఆయన ఏ హీరోతో సినిమా చేసిన కూడా అది మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆ హీరోల కెరియర్ లో బెస్ట్ మూవీ గా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి అనిల్ రావిపూడి కూడా ప్రస్తుతం అదే స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
దీనివల్ల సగటు హీరోల అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక అనిల్ కూడా చాలా ప్రయత్నం చేసి ఏ జానర్ లో చిరంజీవి కి సినిమా బాగుంటుందో అలాంటి జానర్ లోనే సినిమా చేస్తానని చెబుతూ ఉండడం విశేషం. మరి ఏది ఏమైనా వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…